06 May 2024
TV9 Telugu
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో తన వివో వై18 (Vivo Y18), వివో వై 18ఈ (Vivo Y18e) ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
ఒక్టాకోర్ మీడియాటెక్ హెలియో చిప్‌సెట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీలు.
డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, వాటర్‌డ్రాప్ నాచ్ ఫీచర్లతో వచ్చాయి. రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ యూఐ ఔటాఫ్ బాక్స్ ఓఎస్ వర్షన్‌పై పని చేస్తాయి.
గత మార్చిలో సెలెక్టెడ్ మార్కెట్లలో ప్రవేశ పెట్టిన వివో వై03 మోడల్ మాదిరిగానే వివో వై18 (Vivo Y18), వివో వై 18ఈ (Vivo Y18e) ఫోన్ల డిజైన్ ఉంటుంది.
వివో వై18 (Vivo Y18) ఫోన్ రెండు ర్యామ్-రెండు స్టోరేజీ కాన్ఫిగరేషన్లు 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్లు.
రెండు కలర్ ఆప్షన్లు జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. 4జీబీ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,999, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999.
మరోవైపు వివో వై18ఈ ఫోన్ సింగిల్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్‌లో రూ.7,999లకే అందుబాటులో ఉంటుంది.
వివో వై18 మాదిరిగానే జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. వివో వై18, వివో వై18ఈ ఫోన్లు రెండూ వివో ఈ-స్టోర్‌లోనే లభిస్తాయి.