మే 7న పెద్ద నగరాల్లో అన్ని బ్యాంకులకు సెలవు.. కారణం ఇదే!
TV9 Telugu
06 May 2024
దేశంలోని కొన్ని పెద్ద నగరాల్లో మే 7 (మంగళవారం)న అన్ని బ్యాంకులను రోజంతా మూసివేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
2024 లోక్‌సభ ఎన్నికల మూడో దశకు మంగళవారం ఓటింగ్ జరగనుంది, అందువల్ల బ్యాంకులతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయడం జరుగుతుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవు జాబితా ప్రకారం, లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ రోజున అహ్మదాబాద్, భోపాల్, పనాజీ, రాయ్‌పూర్‌లలో బ్యాంకులకు సెలవు.
లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా బ్యాంకులను మూసి ఉంచాలని భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది.
సార్వత్రిక ఎన్నికలు 2024 కాకుండా మే నెలలో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు చాలా ఎక్కువ సెలవులు ఉన్నాయి.
రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు, బసవ జయంతి, అక్షయ తృతీయ, బుద్ధ పూర్ణిమ, నజ్రుల్ జయంతి వంటి పండుగలకు కూడాసెలవులు ఉన్నాయి.
మే నెలలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు బ్యాంకులు మూసి ఉంటాయి. అందుకే ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ సెలవుల కారణంగా బ్యాంకులో ఉద్యోగుల ఉన్నవారి జీతంలో ఎలాంటి కోత ఉండదని తెలిపింది రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా.
ఇక్కడ క్లిక్ చెయ్యండి