- Telugu News Photo Gallery Business photos Wedding Planning Business Low Investment, High Profits, Check Details
Business Ideas: ఆఫీస్‌కి వెళ్లాల్సిన పన్లేదు.. ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఒక చిన్న ఆలోచనతో మీ జీవితాన్నే మార్చుకోండి. ఈ యాడ్ కొటేషన్ మీరు చూసే ఉంటారు. కానీ ఇప్పటి యువతకు ఇది బాగా ఉపయోగపడుతుంది. వ్యాపారంలో రాణించాలనుకునే వారు కేవలం డబ్బు మాత్రమే కాకుండా.. మంచి ఆలోచనలు కూడా పెట్టుబడిగా పెట్టాలి. అలా మంచి ఆలోచనలతో కోట్లు సంపాదించుకున్నవారు ఎందరో ఉన్నారు.
Updated on: May 07, 2024 | 7:00 PM

ఒక చిన్న ఆలోచనతో మీ జీవితాన్నే మార్చుకోండి. ఈ యాడ్ కొటేషన్ మీరు చూసే ఉంటారు. కానీ ఇప్పటి యువతకు ఇది బాగా ఉపయోగపడుతుంది. వ్యాపారంలో రాణించాలనుకునే వారు కేవలం డబ్బు మాత్రమే కాకుండా.. మంచి ఆలోచనలు కూడా పెట్టుబడిగా పెట్టాలి.

అలా మంచి ఆలోచనలతో కోట్లు సంపాదించుకున్నవారు ఎందరో ఉన్నారు. ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వారు ముందుగా ఆలోచించేది పెట్టుబడి కోసమే. పెట్టుబడికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి.? నష్టం వస్తే ఎలా అనే ఆలోచనతోనే ఉంటారు. అయితే మనకు కాస్త ఆలోచన, మంచి నాలెడ్జ్ ఉండాలే కానీ ఎలాంటి పెట్టుబడి లేకుండానే వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. ఇలాంటి ఓ మాంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు చూద్దాం. ఆ బిజినెస్ మరెదో కాదు వెడ్డింగ్ ప్లానింగ్.

ప్రస్తుతం పెళ్లి అనేది ఒక ఈవెంట్‌లా మారిపోయింది. అన్ని రకాల సేవల కోసం ఇతరులపై ఆధారపడే రోజులు వచ్చేశాయ్. కాబట్టి మార్కెట్‌లో ఉన్న ఈ అవసరాన్ని గుర్తించి వ్యాపారం ప్రారంభించి లక్షల్లో డబ్బులు ఆర్జించవచ్చు. నిజానికి వెడ్డింగ్ ప్లానర్ బిజినెస్ ప్రారంభించాలంటే డబ్బులు ఉండాలి కానీ. మీరు కేవలం ఒక కన్సల్టెన్సీలా మారి వ్యాపారాన్ని ప్రారంభిస్తే అసలు పెట్టుబడి అవసరమే ఉండదు.

ఇందుకోసం ముందుగా మీరు పెళ్లికి అవసరమైన అన్ని సేవలు అందించే వారితో ఒప్పందం చేసుకోవాలి. ఉదాహరణకు ఫొటోగ్రాఫర్, వంటకాలు, డెకరేషన్ ఇలా విభాగాల వారితో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. అన్ని సేవలను ఏకతాటిపైకి తీసుకొచ్చి వివాహాన్ని జరిపించాలి.

ఇలా మీకు పెళ్లి చేసుకునే వారి తరపున.. అలాగే ఆయా సేవలు అందిస్తున్న వారి తరఫున కమిషన్ పొందొచ్చు. అయితే ముందుగా మీ ఐడియాను ప్రమోట్ చేసుకోవడం ముఖ్యం. ఇందుకోసం సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి. అయితే ఒకవేళ మీరు ఈ వ్యాపారంలో రాణిస్తే స్వయంగా మీరే అన్ని సేవలు అందించేలా కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఫొటోగ్రఫీ మొదలు డెకరేషన్ వరకు అన్ని మీరే ఏర్పాటు చేసుకొని కూడా ఈవెంట్స్ చేయొచ్చు. దీంతో లక్షల్లో ఆదాయం ఆర్జించవచ్చు. మరెందుకు ఆలస్యం వచ్చేది పెళ్లిళ్ల సీజన్ నాటికి మీ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వండి మరి.




