AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!

ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న మూడు సైబర్ క్రైమ్ ముఠాలను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. సోషల్ మీడియా ద్వారా లింక్స్ పంపుతూ.. తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించి జనాలను ఫ్రాడ్ చేస్తున్నారు ఈ కేటుగాళ్లు. ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి..

ఇన్‌స్టాలో ఆ ఒక్క ప్రకటన.. ఇక నమ్మారో సీన్ సితారయ్యిందంతే.!
Instagram
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: May 07, 2024 | 7:01 PM

Share

ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న మూడు సైబర్ క్రైమ్ ముఠాలను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. సోషల్ మీడియా ద్వారా లింక్స్ పంపుతూ.. తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయంటూ నమ్మించి జనాలను ఫ్రాడ్ చేస్తున్నారు ఈ కేటుగాళ్లు. ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి సైబర్ క్రైమ్ ద్వారా వచ్చిన డబ్బులను దుబాయ్‌కి పంపించి అక్కడ జల్సాలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. రోజురోజుకీ సైబర్ క్రైమ్ కేసులు పెరిగిపోతున్నాయి. జనాల అత్యాశని ఆసరాగా చేసుకుని తక్కువ ఇన్వెస్ట్మెంట్‌తో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి ఉన్నకాడికి దోచేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. ఈ మధ్య ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎంత అవైర్నేస్ తీసుకొచ్చినా.. పబ్లిక్ మాత్రం సైబర్ క్రిమినల్స్ వలలో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఇలా జనాలను మోసం చేసి సైబర్ క్రైమ్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న మూడు గ్యాంగ్స్‌ను అరెస్ట్ చేశారు సిటీ పోలీసులు.

ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో కోటి రూపాయలు మోసపోయిన వ్యక్తి హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. బెర్లిన్ అనే ప్రధాన నిందితుడు దుబాయ్‌లో ఉంటూ ఈ గ్యాంగ్‌ను మెయింటెన్ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. బురా రామ్, గణేష్ రామ్ అనే ఇద్దరు ఇండియాలో ఉంటూ సైబర్ క్రైమ్ చేస్తూ బెర్లిన్‌కి హెల్ప్ చేస్తున్నారని గుర్తించారు. బురా రామ్‌పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి.. నేపాల్ నుంచి ఇండియాకు వస్తుండగా అరెస్ట్ చేశామని తెలిపారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా 47 బ్యాంక్ అకౌంట్స్ తీసి వాటి ద్వారా సైబర్ క్రైమ్‌లో కొల్లగొట్టిన డబ్బులను దుబాయ్‌కి పంపుతున్నారన్నారు.. దేశవ్యాప్తంగా ఈ గ్యాంగ్‌పై 507 కేసులున్నాయన్న సీపీ సైబర్ క్రైమ్ ద్వారా వచ్చిన డబ్బులతో నిందితుడు బురా రామ్ దుబాయ్‌లో ల్యావిష్ లైఫ్ లీడ్ చేశాడని తెలిపారు.

మరో కేసులో గతంలో ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో పనిచేసిన నిందితుడు ఆ బ్యాంక్ ఎంప్లాయీస్‌తో కలిసి ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ తీసి సైబర్ క్రైమ్ చేసేవాళ్లకు అకౌంట్స్‌ని ఇస్తున్నాడని తెలిపారు సీపీ. ఈ గ్యాంగ్‌లో నలుగురిని అరెస్ట్ చేసి వారి అకౌంట్స్‌లో ఉన్న కోటి 43 లక్షల రూపాయలు ఫ్రీజ్ చేశామని తెలిపారు. ఈ గ్యాంగ్‌పైన దేశవ్యాప్తంగా 171 కేసులున్నాయన్నారు. మరో గ్యాంగ్‌లో నలుగురిని అరెస్ట్ చేసి వారి అకౌంట్స్‌లో ఉన్న కోటి 68 లక్షలు ఫ్రీజ్ చేశామని తెలిపారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 192 కేసులున్నాయన్నారు. హైదరాబాద్‌లో ప్రతీరోజు సైబర్ క్రైమ్ ద్వారా రెండు కోట్ల రూపాయలకు పైగా మోసపోతున్నారని తెలిపారు సీపీ. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ఫ్లూఎన్సర్లు ఇన్వెస్టమెంట్ పెడితే ఎక్కువ లాభాలొస్తాయని ప్రమోట్ చేస్తున్నారని.. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలెవరూ అత్యాశకి పోయి సైబర్ క్రైమ్ బారిన పడొద్దని సూచించారు.

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..