PM Modi: తెలంగాణలో మరో విడత ప్రచారం.. తొలి ప్రధానిగా రికార్డు సృష్టించబోతున్న మోదీ!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల సమరం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంటోంది. ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీల నేతలంతా సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం తెలంగాణ, ఏపీలో ప్రచార హోరెత్తించబోతున్నారు.

PM Modi: తెలంగాణలో మరో విడత ప్రచారం.. తొలి ప్రధానిగా రికార్డు సృష్టించబోతున్న మోదీ!
Pm Modi
Follow us

|

Updated on: May 07, 2024 | 6:18 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల సమరం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంటోంది. ఎన్నికల ప్రచారానికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీల నేతలంతా సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం తెలంగాణ, ఏపీలో ప్రచార హోరెత్తించబోతున్నారు. దానిలో భాగంగా.. ఇవాళ రాత్రికి హైదరాబాద్‌కు రానున్నారు ప్రధాని మోదీ. రాత్రి 8 గంటల 10నిమిషాలకు హైదరాబాద్‌ చేరుకోనున్న మోదీ.. రాజ్‌భవన్‌ బస చేస్తారు.

తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఉదయం తొమ్మిదన్నర గంటలకు వేములవాడ చేరుకుని రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుంటారు. వేములవాడ బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత.. వరంగల్‌ సభకు హాజరవుతారు. మే 8 నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలోని వేమువాడకు వస్తున్నారు. దీంతో.. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే భారత ప్రధానమంత్రి ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ లేదా టూటైర్ నగరాల్లో పర్యటించి వెళ్లిపోతుంటారు. అలాంటిది చరిత్రలో మొదటిసారి తెలంగాణలోని ఓ ప్రముఖ శైవక్షేత్రానికి వస్తుండటం విశేషంగా చెప్పుకుంటున్నారు.

ప్రధాని మోదీ హైదరాబాద్ రాజ్ భవన్ లో ఈ రాత్రికి బస చేసి, రేపు ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో వేములవాడకు చేరుకుంటారు. ఉదయం 8 గంటలకు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పర్యటనలో ఉదయం 8:30 గంటలకు మోదీ వేములవాడ శివారులోని బాలానగర్ దగ్గర ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా గుడి చెరువు ప్రాంగణంలోనే హెలిప్యాడ్ సిద్ధం చేశారు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధానిగా మోడీ రికార్డులకు ఎక్కనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు వరంగల్ ప్రచార సభకు హాజరవుతారు. వరంగల్ సభ నుంచి హైదరాబాద్ కు చేరుకుని ఢిల్లీకి పయనమవుతారు. ఇక ఈ నెల 10వ తేదీన మళ్లీ తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ లోని నారాయణ పేట్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. మే 10వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ప్రధాని మోదీ

అటు.. ఏపీలోనూ రెండు ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. వరంగల్‌ సభ తర్వాత.. ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని, అక్కడి నుంచి ఏపీకి వెళ్తారు. మధ్యాహ్నం 3గంటల 45నిమిషాలకు రాజంపేట బీజేపీ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత.. రాత్రి 7 నుంచి 8 గంటలకు విజయవాడలో రోడ్‌ షో నిర్వహిస్తారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి.. బెంజి సర్కిల్‌ వరకు ప్రధాని మోదీ రోడ్‌ షోలో పాల్గొంటారు.

తెలంగాణకు అమిత్ షా, రాజ్‌నాథ్

మే 8వ తేదీ రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు రానున్నారు. మే 9న ఉదయం 9 గంటలకు భువనగిరి నియోజకవర్గంలో జరిగే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. ఇక కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం తెలంగాణలో పర్యటించనున్నారు. మే 9వ తేదీన హైదరాబాద్‌కు చేరకుని, ఉదయం 9 గంటలకు వరంగల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు రాజ్ నాథ్ సింగ్. అనంతరం ఉదయం 11 గంటలకు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని బాన్సువాడలో జరిగే బహిరంగ సభలోనూ రాజ్ నాథ్ సింగ్ పాల్గొంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
కాకరకాయ ఉల్లి కారం ఇలా చేశారంటే.. ఇష్టం లేకున్నా తినేస్తారు!
కాకరకాయ ఉల్లి కారం ఇలా చేశారంటే.. ఇష్టం లేకున్నా తినేస్తారు!
ఆర్సీబీ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వని ఎంఎస్ ధోని.. వీడియో వైరల్
ఆర్సీబీ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వని ఎంఎస్ ధోని.. వీడియో వైరల్
క్రిస్పీ బేబీకార్న్ రైస్‌ ఇలా చేశారంటే.. పిల్లలకు బాగా నచ్చుతుంది
క్రిస్పీ బేబీకార్న్ రైస్‌ ఇలా చేశారంటే.. పిల్లలకు బాగా నచ్చుతుంది
బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు తగ్గుతుందా..? నమ్మలేని నిజాలు మీకోసం
బ్రౌన్ రైస్ తినడం వల్ల బరువు తగ్గుతుందా..? నమ్మలేని నిజాలు మీకోసం
రక్తహీనతతో బాధపడుతున్నారా..? డేంజర్ జోన్ నుంచి బయటపడాలంటే..
రక్తహీనతతో బాధపడుతున్నారా..? డేంజర్ జోన్ నుంచి బయటపడాలంటే..
ఈ చవకైన డ్రై ఫ్రూట్ ప్రతి అవయవానికి బలాన్నిస్తుంది...యవ్వనంగా..
ఈ చవకైన డ్రై ఫ్రూట్ ప్రతి అవయవానికి బలాన్నిస్తుంది...యవ్వనంగా..
కారు లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్..!
కారు లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్..!
రాగులతో ఒక్కసారి ఇలా గారెలు చేయండి.. టేస్ట్ వేరే లెవల్..
రాగులతో ఒక్కసారి ఇలా గారెలు చేయండి.. టేస్ట్ వేరే లెవల్..
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
రొమాన్స్ పండు.. ఉదయాన్నే పరగడుపున తింటే ఆ సమస్యలకు చెక్
రొమాన్స్ పండు.. ఉదయాన్నే పరగడుపున తింటే ఆ సమస్యలకు చెక్
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..