Car Loans: కారు లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే లోన్లు
అన్ని బ్యాంకులు కార్ల లోన్లపై ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ తక్కువ వడ్డీకి కార్ లోన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ బ్యాంకులు 8.70 శాతం నుంచి 9.10 శాతం వరకు వడ్డీ రేట్ల వద్ద నాలుగు సంవత్సరాల కాలానికి రూ.10 లక్షల వరకు కార్ లోన్లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకులు కార్ల లోన్లపై ఎంత శాతం వడ్డీకు లోన్లు ఆఫర్ చేస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

సొంత కారు అనేది ప్రతి మధ్యతరగతి ఉద్యోగి కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ తాము పొదుపు చేసుకునే సొమ్ముతో పాటు బ్యాంకు లోన్ల ద్వారా కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులు కార్ల లోన్లపై ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ తక్కువ వడ్డీకి కార్ లోన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ బ్యాంకులు 8.70 శాతం నుంచి 9.10 శాతం వరకు వడ్డీ రేట్ల వద్ద నాలుగు సంవత్సరాల కాలానికి రూ.10 లక్షల వరకు కార్ లోన్లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకులు కార్ల లోన్లపై ఎంత శాతం వడ్డీకు లోన్లు ఆఫర్ చేస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు సంవత్సరాల కాలానికి రూ. 10 లక్షల కొత్త కారు రుణాల పై 8.70 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది. అందువల్ల ఈఎంఐ రూ.24,565 అవుతుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
భారతదేశపు అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్ లోన్ పై 8.75 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్లతో సహా ఇతర బ్యాంకులు కూడా నాలుగేళ్ల కాలానికి 8.75 శాతం వడ్డీకి కార్ లోన్లను అందిస్తున్నాయి. ఇందులో ఈఎంఐ రూ.24,587.
బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ ఇండియా కారు లోన్లపై 8.85 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. దీని ఈఎంఐ రూ. 24,632గా ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా నాలుగు సంవత్సరాల కాలవ్యవధికి రూ. 10 లక్షల కొత్త కారు రుణంపై 8.90 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. ఈ సందర్భంలో ఈఎంఐ రూ. 24,655 అవుతుంది.
ఐసీఐసీఐ బ్యాంక్
ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ నాలుగు సంవత్సరాల కాలానికి 10 లక్షల రూపాయల కొత్త కారు రుణం పై 9.10 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. అందువల్ల నెలకు రూ. 24,745 ఈఎంఐ కింద చెల్లించాల్సి ఉంటుంది.
యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంక్ నాలుగు సంవత్సరాల కాలానికి 9.30 శాతం వడ్డీ రేటుతో రూ. 10 లక్షల కారు రుణాన్ని అందిస్తోంది. కాబట్టి రూ. 24,835 అవుతుంది.
హెచ్‌డీఎఫ్‌సీ
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నాలుగు సంవత్సరాల కాలానికి 9.40 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్ అందిస్తోంది. రూ. 10 లక్షల కారు రుణంపై ఈఎంఐ రూ. 24,881 అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








