AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office Schemes: నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. పోస్టాఫీసులో బెస్ట్‌ స్కీమ్స్

భారతదేశ పోస్టల్‌లో వివధ రకాల పథకాలు ఉన్నాయి. ఈ పథకాలు మంచి రాబడిని అందిస్తాయి. ప్రైవేట్ చిన్న పొదుపు పథకాలతో పోలిస్తే పోస్టల్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లు కూడా అత్యుత్తమ రాబడిని అందిస్తాయి. ఆ విధంగా మీరు డబ్బు సంపాదించాలనుకుంటే పెట్టుబడి చాలా అవసరం. ఈ పథకాలలో మీరు మీ ఆదాయానికి అనుగుణంగా పెట్టుబడి పెట్టవచ్చు. వీలైనంత త్వరగా ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించండి..

Post Office Schemes: నెలకు రూ.500 డిపాజిట్‌తో చేతికి రూ.4 లక్షలు.. పోస్టాఫీసులో బెస్ట్‌ స్కీమ్స్
Post Office Scheme
Subhash Goud
|

Updated on: May 19, 2024 | 10:17 AM

Share

భారతదేశ పోస్టల్‌లో వివధ రకాల పథకాలు ఉన్నాయి. ఈ పథకాలు మంచి రాబడిని అందిస్తాయి. ప్రైవేట్ చిన్న పొదుపు పథకాలతో పోలిస్తే పోస్టల్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లు కూడా అత్యుత్తమ రాబడిని అందిస్తాయి. ఆ విధంగా మీరు డబ్బు సంపాదించాలనుకుంటే పెట్టుబడి చాలా అవసరం. ఈ పథకాలలో మీరు మీ ఆదాయానికి అనుగుణంగా పెట్టుబడి పెట్టవచ్చు. వీలైనంత త్వరగా ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభించండి. ఎందుకంటే పెట్టుబడి మాత్రమే మీ డబ్బును పెంచుతుంది.

మీరు డబ్బును ఆదా చేసి, దానిని సురక్షితంగా ఉంచినట్లయితే, అది ఏ ఇతర పరిస్థితిలోనైనా ఖర్చు చేయవచ్చు. ఇటువంటి సాధారణ పథకాలలో పెట్టుబడి పెట్టడం భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితులకు సహాయపడుతుంది. ఇండియా పోస్టాఫీసులో ఇలాంటి అనేక పథకాలు ఉన్నాయి. ఇందులో మీరు రూ.500 పెట్టుబడిని ప్రారంభించి మంచి రాబడిని పొందవచ్చు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. మీ ఆదాయం పెరిగే కొద్దీ మీ పెట్టుబడిని పెంచండి.

రూ.500 కంటే తక్కువ పెట్టుబడితో ప్రారంభమయ్యే కొన్ని పోస్ట్ ఆఫీస్ పథకాలు ఇక్కడ ఉన్నాయి.

  1. పీపీఎఫ్‌: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) అనేది దీర్ఘకాలిక పథకం. ఈ పథకంలో కనిష్టంగా రూ.500, గరిష్టంగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకు తప్పనిసరిగా 15 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాలి. మీరు కోరుకుంటే, ప్లాన్ మెచ్యూర్ అయిన తర్వాత మీరు ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. ఈ పథకంలో ప్రతి నెలా రూ.500 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.6,000 ఇన్వెస్ట్ చేస్తారు. ప్రస్తుతం పీపీఎఫ్ 7.1 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పథకంలో ప్రతి నెలా రూ.500 డిపాజిట్ చేయడం ద్వారా 7.1 శాతం వడ్డీతో 15 ఏళ్లలో రూ.1 లక్షా 62 వేల 728 జమ చేసుకోవచ్చు. 5.5 ఏళ్లు పొడిగిస్తే 20 ఏళ్లలో రూ.2 లక్షల 66 వేల 332, 25 ఏళ్లలో రూ.4 లక్షల 12 వేల 321 వరకు జోడించవచ్చు.
  2. సుకన్య సమృద్ది: సుకన్య సమృద్ది యోజన అనేది సంపన్న కుమార్తెల కోసం కనీస వార్షిక డిపాజిట్ రూ. 250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలో 8.2 శాతం వడ్డీ చెల్లిస్తారు. పెట్టుబడి కాలవ్యవధి 15 సంవత్సరాలు. పథకం 21 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. ఇలాంటప్పుడు ఇందులో నెలకు రూ.500 ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లలో మొత్తం రూ.90 వేలు ఇన్వెస్ట్ చేస్తారు. 8.2 శాతం వడ్డీతో 21 ఏళ్ల తర్వాత రూ.2 లక్షల 77 వేల 103 పొందుతారు.
  3. ఆర్‌డీ: పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) పథకం బ్యాంకు ఖాతాలో డబ్బు ఆదా చేయడం లాంటిది. దీనిలో ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. ఈ పథకం చిన్న పెట్టుబడిదారులకు వారి భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి సహాయపడుతుంది. ఈ పెట్టుబడిలో మీరు రూ.100 కూడా పెట్టుబడి పెట్టవచ్చు. మీరు పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన తర్వాత, మీరు 5 సంవత్సరాల పాటు పెట్టుబడిని కొనసాగించాలి. ప్రస్తుతం ఈ పథకం వడ్డీ రేటు 6.7%. ఈ పథకంలో ప్రతి నెలా రూ.500 ఇన్వెస్ట్ చేస్తే 5 ఏళ్లలో రూ.30 వేలు ఇన్వెస్ట్ చేస్తారు. 5 సంవత్సరాల తర్వాత మీకు 6.7% అంటే రూ.5 వేల 681 వడ్డీగా రూ.35 వేల 681 లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!