Nizamabad BJP Josh: అమిత్ షా చేసిన ఆ ఒక్క ప్రకటనతో.. బీజేపీలో మరింత జోష్..!

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి నుంచి బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అభ్యర్థిగా ఖరారు అయినప్పటి నుండి తనదైన స్టైల్‌లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. చాయ్ పే చర్చ పేరుతో అన్ని మండలాలు, గ్రామాల ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తూ వచ్చారు అరవింద్.

Nizamabad BJP Josh: అమిత్ షా చేసిన ఆ ఒక్క ప్రకటనతో.. బీజేపీలో మరింత జోష్..!
Dharmapuri Arvind, Amit Shah
Follow us

|

Updated on: May 07, 2024 | 7:00 PM

నిజామాబాద్ పార్లమెంటు పరిధి ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. దీనికి తోడు ఆదివారం అమిత్ షా బహిరంగ సభలో చేసిన ప్రకటన బీజేపీలో మరింత జోష్ నింపింది. పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు విషయంలో క్లారిటీ ఇచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సిట్టింగ్ ఎంపీ అరవింద్‌పై ప్రశంసలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలులో నిజామాబాద్ ఎంపీ అగ్రగామిగా ఉన్నారని కొనియాడారు. దీంతో బీజేపీలో మరింత జోష్ పెరిగింది.

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి నుంచి బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అభ్యర్థిగా ఖరారు అయినప్పటి నుండి తనదైన స్టైల్‌లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. చాయ్ పే చర్చ పేరుతో అన్ని మండలాలు, గ్రామాల ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తూ వచ్చారు అరవింద్. గెలుపుపై ధీమాతో మొదటి నుంచి దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే ఎంపీ అరవింద్ ఉత్సాహాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన రెట్టింపు చేసింది. బహిరంగ సభ తర్వాత అరవింద్ మరింత దూసుకుపోతున్నారు.

ఆదివారం నిజామాబాద్‌లోని గిరిరాజా కళాశాల మైదానంలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు.. పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు విషయంలో ఇప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నాయి. కేవలం ప్రకటన మాత్రమే వచ్చిందని కార్యాలయ ఏర్పాటు ఎక్కడా అని ప్రశ్నిస్తూ విమర్శలు చేశారు ప్రతిపక్ష నేతలు. ఈ నేపథ్యంలో అమిత్ షా ప్రకటన వారి విమర్శలకు బ్రేక్ ఇచ్చినట్టు అయింది. ఈసారి ఎన్నికల్లో అరవింద్ ను గెలిపిస్తే నిజామాబాదులోనే పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పసుపు రైతుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేశారు అమిత్ షా. ఇది బీజేపీకి కలిసివచ్చే అంశంగా కనిపిస్తుంది.

అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలు అమలు చేయడంలో నిజామాబాద్ పార్లమెంటు మొదటి స్థానంలో ఉందని కితాబిచ్చారు. అర్హులందరికీ కేంద్ర పథకాలను చేరే విధంగా ఎంపీ కృషి చేస్తున్నారని తెలిపారు అమిత్ షా. పార్లమెంటు ప్రజల సంక్షేమం కోసం ప్రధాని వెంట పదేపదే పడుతూ ఒత్తిడి చేసి పనులు సాధించుకున్నారని చెప్పుకొచ్చారు. ఇక జిల్లాలో ప్రధాన సమస్యగా మిగిలిపోయిన బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ని కూడా తెరిపిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రకటనలతో బీజేపీలో మరింత నూతన ఉత్సాహం నిండింది. రెట్టించిన ఉత్సాహంతో అరవింద్ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. పసుపు రైతులు యువకులు, చెరుకు రైతులు కలుస్తూ ఈ విషయాలను మరింత గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మొత్తం మీద నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ జోరు స్పష్టంగా కనిపిస్తుంది. గెలుపుపై ధర్మపురి అరవింద్ పూర్తి ధీమాగా ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..