Telangana Minister KTR: నిధులు కేటాయించండి.. కేంద్ర మంత్రులకు లేఖ రాసిన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
Telangana Minister KTR: కేంద్ర మంత్రులకు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్ర పురపాలక శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు...
Telangana Minister KTR: కేంద్ర మంత్రులకు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్ర పురపాలక శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రులకు రాసిన లేఖలో కోరారు. హైదరాబాద్ సమగ్ర సివరేజ్ మాస్టర్ ప్లాన్, వరంగల్ మెట్రో మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు నిధులు ఇవ్వాలని లేఖలో కేంద్ర మంత్రులు హర్దీప్‌సింగ్, నిర్మలా సీతారామన్‌లను కోరారు. కేంద్ర బడ్జెట్‌లో నిధులను కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ఆమోదించి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని కోరారు. వ్యూహాత్మక నాలా అభివృద్ధికి నిధులు కేటాయించాలన్నారు.
పురపాలక శాఖ ద్వారా పట్టణాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి సహకరించాలన్నారు. ఘన వ్యర్థాలు, మానవ వ్యర్థాలు ట్రీట్‌మెంట్ ప్లాంట్, బయో మైనింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని పేర్కొన్నారు.
దీర్ఘకాలికంగా హైదరాబాద్ నగర అభివృద్ధిని ప్రణాళికబద్దంగా ముందుకు తీసుకెళ్లేందుకు హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేశన్ ఏరియా పేరిట వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగర భవష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాంప్రహెన్సివ్ సివరేజ్ మాస్టర్ ప్లానింగ్ దిశగా ఇప్పటికే తెలంగాణ సర్కార్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందన్నారు.
కాగా, ఈ మాస్టర్ ప్లాన్ కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక, సర్వే, డిజైన్, అంచనాలు నిర్ధారణ వంటి వివిధ కార్యక్రమాలను పూర్తి చేసిందని, ఇందులో భాగంగా మూడు ప్యాకేజీల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నామని వివరించారు. కొద్ది రోజులు కిందట జాతీయ హరిత ట్రిబ్యునల్ మూసీ నది కాలుష్యాన్ని అరికట్టే చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాల మేరకు, అలాగే తెలంగాణ సర్కార్ చేపట్టిన మాస్టర్ ప్లాన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.