AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Review: బోర్డు పరిధిలోకి రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు.. గెజిట్ నోటిఫికేషన్‌పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులు, అడ్వొకేట్‌ జనరల్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌, ఈఎన్సీతో సీఎం సమావేశం.

CM KCR Review: బోర్డు పరిధిలోకి రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు..  గెజిట్ నోటిఫికేషన్‌పై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
CM KCR
Balaraju Goud
|

Updated on: Jul 16, 2021 | 8:40 PM

Share

CM KCR Review on Gazette Notification: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులు, అడ్వొకేట్‌ జనరల్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌, ఈఎన్సీతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజెట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న అంశాల కారణంగా రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉంటుందని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ అక్టోబరు నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో అప్పటి నుంచి జరగబోయే మార్పులు, నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై అధికారుల ద్వారా సీఎం పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకున్నారు. నీళ్ల లెక్క తేలాకే విధివిధానాలు ప్రకటించి ఉంటే బాగుండేదని పలు అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

తెలుగు రాష్ట్రాల మధ్య బిగుసుకుంటున్న జల వివాదంపై దృష్టి సారించిన కేంద్రం.. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధులు ఖరారు చేస్తూ గెజిట్లు విడుదల చేసింది. రెండు రాష్ట్రాల్లో విస్తరించిన కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నిర్వాహణను బోర్డులకు అప్పగించింది. రెండు బేసిన్‌లోని ప్రాజెక్టులను బోర్డుల పర్యవేక్షణ కిందికి తీసుకువచ్చింది. అక్టోబర్ 14 నుంచి ఈ గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానుంది. గతేడాది అక్టోబరు 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ మినిట్స్‌ ప్రకారం బోర్డు పరిధికి సంబంధించిన అంశాలను నిర్ధారించారు. కృష్ణా ట్రైబ్యునల్‌ -2 ప్రకారం ప్రాజెక్టులవారీ కేటాయింపులు ఇంకా ఖరారు కానందున.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం బచావత్‌ ట్రైబ్యునల్‌ అవార్డు మేరకే కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేస్తారు.. కృష్ణా ట్రైబ్యునల్‌-2 తీర్పు వచ్చాక దాని ప్రకారం సవరణలు జరుగుతాయి.

పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టులకు బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులు లేనందున, ప్రస్తుత ట్రైబ్యునల్‌ ప్రకారం కేటాయింపులకు రెండు రాష్ట్రాలు ప్రయత్నించాలి. తర్వాత ఈ ప్రాజెక్టుల నిర్వహణ కూడా బోర్డు చూస్తుంది. అయితే, నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్‌.ఎల్‌.బి.సి., వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు 11వ షెడ్యూలులో ఉన్నాయి.

గోదావరి బోర్డుకు సంబంధించి పూర్తయిన, నిర్మాణంలో ఉన్న అనుమతులు వచ్చిన ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి రానున్నాయి. నిర్మాణంలో ఉన్నవి, కొత్తవి, భవిష్యత్తులో రెండు రాష్ట్రాలు చేపట్టే ప్రాజెక్టులకు సంబంధించి అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి పొందిన తర్వాత గెజిట్‌లో చేర్చుతుంది. 2018 ఫిబ్రవరి, 2020 జనవరిలో రెండు రాష్ట్రాలతో దీనిపై కేంద్రం చర్చించినట్లు కూడా నోటిఫికేషన్‌లో పేర్కొంది.

Read Also… Scorpio Mystery: పదేపదే చక్కర్లు కొట్టిన వాహనం.. గుట్టు వీడుతున్న సిరివెళ్ల స్కార్పియో మిస్టరీ.. ఇంతకీ ఎందుకా ప్రయత్నం?