AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Komatireddy: ఏడారిగా మారనున్న ఆలేరును కాపాడుకుంటాం.. త్వరలో పాదయాత్ర చేస్తానన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

యాదాద్రి జిల్లాలోని గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి త్వరలోనే పాదయాత్ర చేపడుతానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు.

Komatireddy: ఏడారిగా మారనున్న ఆలేరును కాపాడుకుంటాం.. త్వరలో పాదయాత్ర చేస్తానన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy
Balaraju Goud
|

Updated on: Jul 16, 2021 | 10:01 PM

Share

Congress MP Komatireddy Venkat Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంకా గుర్రుగానే ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేజారినప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన… ఇప్పట్లో మెత్తబడేలా కనిపించట్లేదు. కాంగ్రెస్‌లో కొనసాగుతూనే ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌పై ఆయన తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రాకతో కాంగ్రెస్‌కు పునర్వైభవం వస్తుందని ఓవైపు ఆ పార్టీ శ్రేణులు బలంగా విశ్వసిస్తుంటే… మరోవైపు కోమటిరెడ్డి మాత్రం అంత సీన్ లేదన్నట్లుగానే ఎద్దేవా చేస్తున్నారు.

అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇకపై తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. టీపీసీసీ కొత్త టీమ్‌ను టార్గెట్ చేస్తున్న ఎంపీ కోమటిరెడ్డి.. తాజాగా తన నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టడానికి సిద్ధమయ్యారు. యాదాద్రి జిల్లాలోని గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి త్వరలోనే పాదయాత్ర చేపడుతానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. గంధమల్ల రిజర్వాయర్ ఎత్తేస్తె ఆలేరుతో సహా పరిసర ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలిసినా.. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాసార్లు యాదాద్రికి వచ్చారని.. కానీ ఒక్కసారి కూడా యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీ పరిస్థితి పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి కేవలం గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకే పరిమితమైందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా చూడాలని సూచించారు. కేవలం రైతు వేదికలు, స్మశానవాటికలు ప్రారంభించడానికి తమను పిలుస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామంలో 400 ఇళ్లు కట్టి పిలిస్తే దానికి ఒక అర్థం ఉంటుందని తెలిపారు. డిగ్రీలు చదివిన విద్యార్థులు ఉపాధి హామీ కూలికి పోవాలంటూ వ్యాఖ్యలు చేసిన పనిమాలిన వాళ్లను మంత్రులుగా పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యేవరకు ఉద్యమిస్తామని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు.

Read Also…  BS Yediyurappa: ప్రధాని మోదీతో యడియూరప్ప భేటీ.. అనంతరం కీలక వ్యాఖ్యలు చేసిన కర్ణాటక సీఎం