CM KCR Health Corona: కరోనాను జయించిన సీఎం కేసీఆర్.. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారన్న వైద్యులు..
CM KCR Health Corona: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేగంగా కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు పరీక్షలకు నిర్వహించి వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. తాజాగా నిర్వహించిన...
CM KCR Health Corona: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు పరీక్షలు నిర్వహించిపన వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. తాజాగా నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్ పరీక్షలో కేసీఆర్‌కు కరోనా నెగిటివ్‌గా తేలింది. ప్రస్తుతం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యులు తెలిపారు. అన్ని రక్త పరీక్షల రిపోర్ట్ లు నార్మల్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. తక్కువ సమయంలో కరోనాను జయించారు కేసీఆర్. ఇదిలా ఉంటే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో కేసీఆర్‌కు కరోనా సోకినట్లు అందరూ భావించారు. అనంతరం తాజాగా రెండు రోజుల క్రితం ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా అందులో నెగిటివ్ అని తేలింది. కానీ ఆర్‌టీపీసీఆర్‌లో పాజిటివ్ అని తేలడంతో కాస్త గందరగోళానికి దారి తీసింది. కానీ తాజాగా నిర్వహించిన పరీక్షలో కేసీర్ పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నారని తేలింది. ఇక ఈ నేపథ్యంలో కేసీఆర్ రెండు రోజుల్లో ప్రగతి భవన్ చేరుకునే అవకాశం ఉందని, అనంతరం యశోద ఆసుపత్రిలో మరోసారి పరీక్షలు చేయించుకుంటారని సమాచారం.
ఇదిలా ఉంటే.. కేసీఆర్‌కు ఏప్రిల్ 19న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి లోని తన ఫామ్‌హౌస్‌లో హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. వైరస్ తీవ్రతను తెలుసుకునేందుకు ఏప్రిల్ 21న యశోదా ఆస్పత్రిలో సిటీ స్కాన్ చేశారు. ఆ సమయంలో అంతా నార్మల్‌గానే ఉందని డాక్టర్లు తెలిపారు. అనంతరం తిరిగి ఫామ్ హౌస్‌కు వెళ్లారు. అనంతరం అక్కడే చికిత్స కొనసాగించారు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో మొత్తం ముగ్గురికి కరోనా వచ్చింది. కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్‌కు కూడా పాజిటివ్ వచ్చిన విషయం విధితమే.
Covid Treatment: ప్రైవేటు ఆసుపత్రులకు తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు.. వివరాలివే.!
అడిగితే నేనే రాజీనామా చేసేవాడిని..! కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం కావాలన్నా..? ఈటల మాటలు..