KCR Meets Sharad Pawar:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శరద్ పవార్ ఇచ్చిన మద్దతు మర్వలేంః సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌ను ముంబైలో కలిశారు. ఈ సందర్భంగా శరద్ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు.
CM KCR Meets Sharad Pawar: భారతీయ జనతా పార్టీ(BJP)కి వ్యతిరేకంగా పిడికిలి బిగిసింది. అధికార దుర్వినియోగానికి బీజేపీ సర్కార్ పాల్పడుతోందంటూ తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు వేసిన తొలి అడుగు బలంగానే పడింది. మహారాష్ట్ర(Maharashtra) వేదికగా మహాసంకల్పానికి శ్రీకారం చుట్టారు. దేశ రాజకీయాలు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు తెలంగాణ సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే(Udhav Thakeray). ఇకపై కలిసి నడవాలని నిర్ణయించారు. త్వరలోనే కలిసివచ్చే నేతలందరితో హైదరాబాద్‌లో సమావేశం పెడుతామన్నారు కేసీఆర్. ఈ మీటింగ్‌లోనే యాక్షన్ ప్లాన్‌ను రూపొందించనున్నారు. అనంతరం నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌తోనూ కేసీఆర్ అయ్యారు.
దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన సమావేశంలో దేశ రాజకీయాలపై చర్చించారు కేసీఆర్, ఉద్దవ్ థాక్రే. కేంద్ర ప్రభుత్వ తీరు మారాలని అన్నారు కేసీఆర్. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర, తెలంగాణ సోదర రాష్ట్రాలని…అనేక అంశాల్లో కలిసి పనిచేయాల్సి ఉందని అన్నారు.అన్ని అంశాలపైనా ఏకాభిప్రాయానికి వచ్చామని.. ఇద్దరి చర్చల ఫలితాలు త్వరలోనే చూస్తారని చెప్పారు కేసీఆర్. మహారాష్ట్రలో మొదలయ్యే కూటములు ఎప్పుడూ విజయవంతం అవుతాయన్న కేసీఆర్.. ఇకపై అన్ని మంచి పరిణామాలే అని కామెంట్ చేశారు. ప్రెస్‌మీట్ చివర్లో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. గ్రూప్ ఫోటో కావాలని అడిగింది మీడియా. సీఎం కేసీఆర్ విక్టరీ సింబల్ చూపించారు. అయితే ఇది పిడికిలి బిగించాల్సిన సమయం అన్నారు థాక్రే.. అవును.. ఇది పోరాడాల్సిన టైమ్ అని చెప్పారు కేసీఆర్..
అనంతరం, కేసీఆర్ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌ను కలిశారు. ఈ సందర్భంగా శరద్ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శరద్ పవార్ మద్దతిచ్చారని.. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, శరద్ పవార్ ఆశీస్సులను తెలంగాణ ప్రజలు జీవితాంతం మరిచిపోరని కేసీఆర్ అన్నారు. శరద్ పవార్ భేటీ అనంతరం కేసీఆర్ మీడియాతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో నటుడు ప్రకాష్ రాజ్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, పలువురు ఎన్సీపీ నేతలు పాల్గొన్నారు.
కేసీఆర్ మాట్లాడుతూ, శరద్‌పవార్ మనకు మార్గదర్శకుడు. దేశంలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించామన్నారు. 1969 నుంచి తెలంగాణ పవార్ మద్దతుగా ఉన్నారు. 75 ఏండ్ల స్వేచ్ఛా భారతంలో సమస్యలు అలాగే ఉన్నాయి. అభివృద్ధి కుంటుపడింది. దేశ అభివృద్ధికి కొత్త ఎజెండా తేవాల్సిన సమయం వచ్చింది. దేశం సరైన రీతిలో ముందుకు పోవడం లేదు. త్వరలో భావసారుప్యం గల పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. అందరం కలిసి దేశాభివృద్ధికి చేపట్టాల్సిన ఎజెండాపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రజల ముందుంచుతాం. దేశంలో విశేష అనుభవం ఉన్న నేత శరద్ పవార్. మోడీ సర్కారుపై చేపట్టిన తమ పోరాటానికి శరద్ పవార్ మద్దతుగా నిలిచి ఆశీర్వదించారని కేసీఆర్ చెప్పారు.
శరద్ పవార్ ఆధ్వర్యంలో త్వరలో బారామతిలో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. భావసారూప్యత గల పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి దేశ పరివర్తనకు కృషి చేస్తామన్న కేసీఆర్.. అభివృద్ధి ఎలా ఉండాలో, ప్రస్తుతం అభివృద్ధి జరగడం లేదన్నారు. దేశంలో మార్పు రావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం దేశంలో అనేక సమస్యలు పీడిస్తున్నాయి. నిరుద్యోగం, ఇంధన ధరలు చెప్పుకుంటూ పోతే మోడీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైంది. తెలంగాణ అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయి. దేశ అభివృద్ధికి కేసీఆర్ లాంటి నేతలు అవసరం. కేసీఆర్ తో కలిసి పనిచేస్తాం.’’ అని అన్నారు.
Today, we discussed solutions to the problems our country is facing, be it poverty or farmers’ issues. We did not have much of a political discussion, because the issue is development… we will again hold discussions later: NCP chief Sharad Pawar, post-meeting Telangana CM KCR pic.twitter.com/KtM2e3RQWk
— ANI (@ANI) February 20, 2022
Read Also…..