CM KCR: ముంబై పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో కీలక భేటీ
టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముంబైలో సమావేశమయ్యారు.
CM KCR Mumbai Tour: టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే(Uddhav thakre) ముంబైలో సమావేశమయ్యారు.మిషన్ 2024 దిశగా తొలి అడుగు పడింది. భారతీయ జనతా పార్టీ ముక్త్ భారత్ నినాదం ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సమావేశం అయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు… NDA సర్కారుని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ఉద్దవ్ నివాసం వర్షాలో ఈ సమావేశం జరిగింది. కేసీఆర్ బృందానికి ఉద్దవ్ విందు భోజనం ఏర్పాటు చేశారు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, సినీ నటులు ప్రకాష్ రాజ్, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని BJP సర్కారుపై కొద్దిరోజులుగా సీఎం కేసీఆఱ్ నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీని తరిమికొడితేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఇందుకోసం కలిసివచ్చే.. పార్టీలు, నేతలు, ముఖ్యమంత్రులను కలుపుకొని పోవాలని నిర్ణయించారు. ఈ ప్లానింగ్‌లో భాగంగానే యాక్షన్‌లో దిగారు కేసీఆర్. ఈ మహాసంకల్పాన్ని మహారాష్ట్ర టూర్‌తో మొదలుపెట్టారు.
Telangana CM K Chandrashekar Rao met Maharashtra CM Uddhav Thackeray at Varsha bungalow – Maharashtra CM’s official residence in Mumbai.
The Telangana CM is on a one-day visit to the state today. pic.twitter.com/JH5346nTmQ
— ANI (@ANI) February 20, 2022
ఉద్దవ్‌థాక్రేతో మీటింగ్ తర్వాత NCP అధినేత శరద్‌పవార్‌తో సమావేశం అవుతారు కేసీఆర్. దేశరాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత అయిన పవార్‌తో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు.ఇప్పటికే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తోనూ కేసీఆర్ విడివిడిగా ఇప్పటికే చర్చలు జరిపారు. త్వరలోనే మరికొన్ని పార్టీల నేతలు, బీజేపీ, కాంగ్రెస్సేతర సీఎంలతోనూ కేసీఆర్ సమావేశం కానున్నారు. గతంలో మాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యులర్ అధినేత హెచ్‌డి దేవెగౌడ రావుతో మాట్లాడి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం దేవెగౌడను కలుసుకుని సమస్యలపై చర్చించేందుకు బెంగళూరు వస్తానని కేసీఆర్ తెలిపారు.
ఈ సమావేశం అనంతరం సాయంత్రం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ఉద్ధవ్ ఠాక్రే గత వారం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారని, ముంబైకి రావాల్సిందిగా ఆహ్వానించారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ కేసీఆర్ పోరాటానికి థాకరే సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేసీఆర్ భేటీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు.
Read Also…. Sonu Sood: పంజాబ్ మోగాలో సోనూసూద్‌కు ఈసీ ఝలక్.. కారును సీజ్ చేసిన పోలీసులు..