CM KCR: బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది.. ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలిః కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన కేబినెట్ మంత్రులు, నేతలతో సమావేశమయ్యారు. ముంబైలోని సీఎం అధికారిక నివాసం వర్ష బంగ్లాలో ఈ భేటీ జరిగింది.

CM KCR: బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది.. ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలిః కేసీఆర్
Kcr Uddhav Thackeray
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 20, 2022 | 5:19 PM

KCR meets Uddhav Thackeray: దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ముంబై వేదికగా అడుగులు వేస్తున్నామని తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ముంబై పర్యటనలో భాగంగా మ‌హారాష్ట్ర(Maharashtra) సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో స‌మావేశం ముగిసిన అనంత‌రం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశ రాజ‌కీయాల‌పై చ‌ర్చించేందుకే మ‌హారాష్ట్రకు వ‌చ్చానని కేసీఆర్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ(BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాల‌పై చ‌ర్చించామన్నారు. కేంద్ర సంస్థల‌ను బీజేపీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని ఆయన మండిపడ్డారు. వైఖ‌రి మార్చుకోకుంటే బీజేపీకి ఇబ్బందులు త‌ప్పవని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన కేబినెట్ మంత్రులు, నేతలతో సమావేశమయ్యారు. ముంబైలోని సీఎం అధికారిక నివాసం వర్ష బంగ్లాలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సినీ నటులు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. అసలే ప్రతిపక్షాలు బీజేపీని చుట్టుముట్టేందుకు సిద్ధమయ్యాయి. బీజేపీయేతర నేతల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి దేశంలోనే థర్డ్‌ఫ్రంట్‌ పరిమళాన్ని మరోసారి రగిల్చింది టీఆర్ఎస్. థాకరేతో సమావేశమైన తర్వాత, కేసీఆర్ ఎన్సీపీ నేత పవార్ నివాసానికి వెళ్లి జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు రావు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన అధ్యక్షుడు థాకరే గత వారం కేసీఆర్‌కు ఫోన్ చేసి ముంబైకి ఆహ్వానించారు.

దేశంలో జ‌రుగుతున్న రాజకీయ ప‌రిణామాల‌పై ఇరువురు ముఖ్యమంత్రులు చ‌ర్చలు జరిపారు. దేశంలో రావాల్సిన మార్పుల‌పై చ‌ర్చించామని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుత తరుణంలో ప్రాంతీయ పార్టీలన్ని ఏక‌తాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశానికి బీజేపీ కాంగ్రెస్ యేతర ప్రత్యామ్నాయ రాజ‌కీయ‌ వేదిక ఏర్పాటు కావల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ చ‌ర్చలు ఆరంభం మాత్రమేనన్న కేసీఆర్.. మున్ముందు పురోగ‌తి వ‌స్తుంద‌న్నారు. త్వర‌లోనే అన్ని ప్రాంతీయ పార్టీల‌తో పాటు జాతీయ పార్టీలతో స‌మావేశ‌మై భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ‌ను ప్రక‌టిస్తామ‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

అలాగే, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను హైద‌రాబాద్ రావాల‌ని కోరుతున్నానని కేసీర్ తెలిపారు. ఇంకా అనేక మంది ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో చ‌ర్చలు జ‌రుపుతామన్నారు. శివాజీ, బాల్ ఠాక్రే వంటి యోధుల స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పోరాడుతామన్న కేసీఆర్.. ప‌టిష్టమైన దేశం కోసం అంద‌రూ కలిసి రావాలన్నారు. దేశంలో గుణాత్మక‌మైన మార్పు అవ‌స‌రం. అన్ని విష‌యాల‌పై ఏకాభిప్రాయానికి వ‌చ్చామన్నారు. రాబోయే రోజుల్లో క‌లిసి పని చేయాల‌ని నిర్ణయించామన్న కేసీఆర్.. త్వర‌లో హైద‌రాబాద్‌లో లేదా మ‌రో చోట‌ అంద‌రం నేత‌లం క‌లుస్తామన్నారు. భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో చేప‌ట్టిన ప్రాజెక్టుల‌తో తెలంగాణ స్వరూపం మారిపోయింది. తెలంగాణ‌, మ‌హారాష్ట్ర సోద‌ర రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల మ‌ధ్య ఉమ్మడి స‌రిహ‌ద్దు 1000 కిలోమీట‌ర్లు ఉంది. రెండు రాష్ట్రాలు మంచి అవ‌గాహ‌న‌తో ముందుకు న‌డ‌వాల్సిన అవ‌స‌రం ఉందన్నారు కేసీఆర్. 75 ఏండ్ల స్వాతంత్ర్యం త‌ర్వాత కూడా దేశంలో అనేక స‌మ‌స్యలు నెల‌కొన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఐక్యతకు మద్దతు తెలిపారు. రాష్ట్రాల హక్కులను కాపాడాలని డిమాండ్ చేయడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోషించిన పాత్రపై థాకరే అభినందించారు. వారికి పూర్తి సహకారం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇదిలావుంటే, వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో థర్డ్‌ఫ్రంట్‌ దిశగా సీఎం కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధం లేని పార్టీలన్నింటిని ఏకతాటి మీదకు తీసుకువచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కేసీఆర్, తేజస్వి యాదవ్‌ల భేటీకి సంబంధించిన ఫోటోలు పత్రికల్లో హల్‌చల్ చేస్తున్నాయి. అంతకుముందు ఆయన సీపీఐ(ఎం), సీపీఐ నేతలను కూడా కలిశారు.