AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala: తనతో కలిసి 22 ఏళ్ళు ప్రయాణించిన ఎంప్లాయ్‌కి కాస్ట్లీ కార్ గిఫ్ట్ ఇచ్చిన ఓనర్.. కాస్ట్ ఎంతో తెలుసా..?

Kerala Businessman: తనతో పాటు కష్టాల్లో, సుఖాల్లో అన్ని సమయాల్లో వెన్నంటి ఉంటూ.. తమ ఉన్నతికి పట్టుబడిన ఉద్యోగులను కొంతమంది వ్యాపారస్తులు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. వారిమీద తమ అభిమానాన్ని..

Kerala: తనతో కలిసి 22 ఏళ్ళు ప్రయాణించిన ఎంప్లాయ్‌కి కాస్ట్లీ కార్ గిఫ్ట్ ఇచ్చిన ఓనర్.. కాస్ట్ ఎంతో తెలుసా..?
Kerala Businessman Gifts Me
Surya Kala
|

Updated on: Feb 20, 2022 | 5:28 PM

Share

Kerala Businessman: తనతో పాటు కష్టాల్లో, సుఖాల్లో అన్ని సమయాల్లో వెన్నంటి ఉంటూ.. తమ ఉన్నతికి పట్టుబడిన ఉద్యోగులను కొంతమంది వ్యాపారస్తులు ఎప్పుడూ గుర్తుంచుకుంటారు. వారిమీద తమ అభిమానాన్ని వివిధ సందర్భాల్లో విభిన్న రూపాల్లో ప్రదర్శిస్తుంటారు కూడా. తాజా దక్షిణాదిలోని ప్రముఖ వ్యాపార సంస్థల అధినేత తనను నమ్ముకుని.. తన సంస్థలో వివిధహోదాల్లో గత 22 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగస్థునికి మెర్సిడెస్ బెంజ్ కారును బహుమతిగా అందజేశారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..

దక్షిణాదిలో ఎలక్ట్రానిక్స్  అండ్ గృహోపకరణాల రిటైల్ చైన్ సంస్థ యజమాని AK షాజీ తన ఉద్యోగి CR అనీష్‌కు 45 లక్షల రూపాయల విలువైన బెంజ్కారుని బహుమతిగా ఇచ్చారు. తన ఎకె షాజీ సంస్థలో మార్కెటింగ్, మెయింటెనెన్స్, బిజినెస్ డెవలప్‌మెంట్ వంటి వివిధ విభాగాల్లో.. పలు హోదాల్లో పనిచేసిన సిఆర్ అనీష్‌కు ఖరీదైన కారును బహూకరించారు.

రెండు దశాబ్దాలుగా కంపెనీ పట్ల అంకితభావంతో నిబద్ధతో అనీష్ పనిచేస్తునందుకు గుర్తింపుగా షాజీ ఈ కారును బహుమతిగా ఇచ్చాడు.  ప్రస్తుతం, అనీష్ myGలో చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా విధులను నిర్వహిస్తున్నారు. కారు అందజేస్తున్న ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన షాజీ..  తన ఉద్యోగి విధి నిర్వహణను ఎంత గొప్పగా నిర్వహిస్తారో.. తెలియజేస్తూ.. ప్రశంసించారు. అనీష్‌ను తన సంస్థకు మూల స్తంభం” అని పిలిచారు.

అనీష్ తాను myGని సంస్థ ప్రారంభించక ముందు కూడా తనతో ఉన్నాడని.. మా ఇద్దరి మధ్య బంధం 22 సంవత్సరాలుగా కొనసాగుతుందని చెప్పారు. తాను ఎప్పుడూ నన్ను ఎప్పుడూ నిరాశపరచలేదని షాజీ వీడియోలో పేర్కొన్నాడు. మా ఇద్దరి మధ్య బంధం అన్నదమ్ముల బంధం అని పేర్కొన్నారు.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో.. షాజీ బ్లాక్ SUV కీలను అనీష్‌కి అందజేస్తున్నారు.. తన ఆఫీసులో ఇతర సిబ్బంది, అతని కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఖరీదైన కారుని అందజేశారు.  షాజీ తన ఉద్యోగికి ఇచ్చిన గుర్తింపు  ప్రపంచవ్యాప్తంగా ఉన్న  నెటిజన్ల నుంచి ప్రశంసలను అందుకుంటుంది.

అయితే ఇలా షాజీ తన ఉద్యోగులకు గిప్ట్ ఇస్తూ.. ఆశ్చర్య పరచడం ఇదే మొదటిసారి కాదు. రెండేళ్ల క్రితం తన ఆరుగురు ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చారని.. తన కంపెనీ తరపున తరచూ తన సిబ్బందిని ఖరీదైన విదేశీ పర్యటనలకు పంపుతారని ఒక పత్రికా పేర్కొంది.

తమ సంస్థలో ఉన్న ఉద్యోగులు సంతోషంగా సంతృప్తిగా ఉంటేనే వ్యాపారం విజయవంతగా నడుస్తుందని షాజీ పలుమార్లు తెలిపారు.

View this post on Instagram

A post shared by Shaji Ak (@shaji_ak)

Also Read:

కచ్చా బాదం సాంగ్ కు డ్యాన్స్ చేసిన బీజేపీ నేత, గ్రేట్ రెజ్లర్ ఖలీ..నెట్టింట వీడియో వైరల్..

 నగరవాసులకు అలెర్ట్‌.. ఆ రెండు రోజుల్లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం..