Khali Dances: కచ్చా బాదం సాంగ్ కు డ్యాన్స్ చేసిన బీజేపీ నేత, గ్రేట్ రెజ్లర్ ఖలీ..నెట్టింట వీడియో వైరల్..

Kacha Badam Song: భారతీయ ప్రొఫెషనల్ రెజ్లర్, నటుడు, మాజీ పవర్‌లిఫ్టర్ ది గ్రేట్ ఖలీ(Khali)ని కూడా 'కచా బాదం' సాంగ్ ఫీవర్ వదలలేదు. ఖలీ ఈ సాంగ్ కు డ్యాన్స్ చేసిన  వీడియో సోషల్ మీడియాలో..

Khali Dances: కచ్చా బాదం సాంగ్ కు డ్యాన్స్ చేసిన బీజేపీ నేత, గ్రేట్ రెజ్లర్ ఖలీ..నెట్టింట వీడియో వైరల్..
Khali Dances On Kacha Badam
Follow us
Surya Kala

|

Updated on: Feb 20, 2022 | 4:44 PM

Kacha Badam Song: భారతీయ ప్రొఫెషనల్ రెజ్లర్, నటుడు, మాజీ పవర్‌లిఫ్టర్ ది గ్రేట్ ఖలీ(Khali)ని కూడా ‘కచా బాదం’ సాంగ్ ఫీవర్ వదలలేదు. ఖలీ ఈ సాంగ్ కు డ్యాన్స్ చేసిన  వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది, ఇందులో ప్రస్తుతం ఆన్ లైన్ లో ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ కచ్చా బాదంకు డ్యాన్స్ చేస్తున్నాడు. ప్రొఫెషనల్ రెజ్లర్ ఖలీ అసలు పేరు దలీప్ సింగ్ రాణా దలీప్ సింగ్. ఈయన గురువారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఖలీ బీజేపీలో చేరడంతో… ఆయనకు పంజాబ్ ఎన్నికల్లో  టిక్కెట్ ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఖలీ 2000లో తన ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టాడు. తన WWE కెరీర్ ప్రారంభించే ముందు, అతను పంజాబ్ పోలీసు అధికారి. ఖలీ తన WWE కెరీర్‌లో WWE ఛాంపియన్‌గా కూడా నిలిచాడు. నాలుగు హాలీవుడ్ సినిమాలు, రెండు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు.

కచ్చా బాదం పాట వైరల్:  ప్రస్తుతం దేశవిదేశాల్లో కూడా కచ్చా బాదం సాంగ్ వైరల్ అవుతుంది. ఈ సాంగ్ కు సెలబ్రెటీలు, సామాన్యులు డ్యాన్స్ చేస్తూ ఆ రీల్స్ ని షేర్ చేస్తున్నారు. ఈ కోవలోకి ఇప్పుడు ప్రముఖ రెజ్లర్ ఖలీ కూడా చేరారు.  తాజాగా ఖాలి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో కచ్చ బాదం పాటకు తనదైన స్టైల్‌లో డ్యాన్స్ చేశారు ది గ్రేట్ ఖలీ . ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . 1.25 లక్షల మందికి పైగా దీన్ని లైక్ చేసారు. ఈ వీడియోలో ఖలీ సూట్ , బూటు, క్యాప్ ధరించి దర్జాగా బెడ్ మీద పడుకుని ఉన్నాడు. ఈ పాటకు తన పెదవి కలుపుతూ.. బెడ్ మీద నుంచి కదలకుండా కేవలం శరీరం కదుపుతూ సాంగ్ కు అనుగుణంగా డ్యాన్స్ చేశాడు ఖలీ.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన భుబన్ బద్యాకర్ అనే సాధారణ వేరుశెనగ విక్రేత పాడిన ‘కచ్చా బాదం’ పాట రాత్రికిరాత్రే ఇంటర్నెట్ సంచలనంగా మారింది.

Also Read:

 మనిషి జీవితంలో ఈ 5 పాఠాలు తెలుసుకుంటే.. ఎప్పటికీ మోసపోరంటున్న చాణక్య..