Viral Video: టీచర్ బదిలీతో విద్యార్థుల కన్నీరు మున్నీరు.. వినూత్నంగా వీడ్కోలు.. నెట్టింట్లో వైరల్ వీడియో..
జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మన అభివృద్ధిని కోరుకునేది మనకు పాఠాలు చెప్పిన గురువులు మాత్రమే. వారు తరగతి పాఠాలను కాకుండా జీవిత పాఠాలను కూడా మనకు నేర్పిస్తారు
జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మన అభివృద్ధిని కోరుకునేది మనకు పాఠాలు చెప్పిన గురువులు మాత్రమే. వారు తరగతి పాఠాలను కాకుండా జీవిత పాఠాలను కూడా మనకు నేర్పిస్తారు. అందుకే మనం ఏ స్థాయిలో ఉన్నా మనకు విద్య నందించిన గురువులను గుర్తు పెట్టుకుంటాం. వారికి తగిన గౌరవం ఇస్తుంటాం. ఇక చదువుకుంటున్నప్పడు కచ్చితంగా ప్రతి ఒక్కరికీ ఒక ఫేవరేట్ టీచర్ ఒకరుంటారు. వారు వేరొక చోటుకు బదిలీ కావడం లేదా రిటైర్ అయిపోయినప్పుడు వారికి ఘనంగా వీడ్కోలు పలకడానికి ఎన్నో ఏర్పాట్లు చేస్తాం. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాలోని 24 పరగణా ప్రాంతంలో కటియాహట్ బికేఏపీ అనే బాలికల పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో సంపా అనే టీచర్ విధులు నిర్వహిస్తోంది. ఆమె అన్నా, ఆమె బోధించే పాఠాలన్నా అక్కడి విద్యార్థులకు ఎంతో ఇష్టం. ఈక్రమంలోనే పాఠశాలలోని విద్యార్థులకు టీచర్‌తో మంచి సాన్నిహిత్యం ఏర్పాడింది.
షారుఖ్ పాటతో వీడ్కోలు..
అయితే ఉన్నట్లుండి సంపా టీచర్‌కు వేరొకచోటుకు ట్రాన్స్‌ఫర్ అయింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే తమకు ఎంతో ఇష్టమైన టీచర్‌కు వినూత్నంగా వీడ్కోలు పలకాలని భావించారు. ఇందు కోసం విద్యార్థులు టీచర్ కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత ఆమెను పాఠశాల మైదానం లోకి తీసుకెళ్లారు. అప్పుడు విద్యార్థినులందరూ మోకాళ్లపై కూర్చొని షారుఖ్ ఖాన్ నటించిన ‘రబ్నే బనాదీ జోడి’ సినిమాలోని ఒక పాటను పాడారు. ‘నా కుచ్ మాంగ.. నా కుచ్ పూచా.. తుజ్ మే రబ్ దిఖ్తా హై.. మేడం హమ్ క్యా కరే’ అంటూ ఆలపిస్తూ తమ చేతుల్లోని గులాబీ పువ్వులను టీచర్‌కు అందించారు. కాగా ఈ సందర్భంగా విద్యార్థులందరూ కన్నీరు పెట్టుకోవడంతో సంపా టీచర్ కూడా కన్నీరుమున్నీరైంది. విద్యార్థులను ప్రేమగా హత్తుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారంతా తమ స్కూల్ డేస్ గుర్తుకు వస్తున్నాయంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.
Students pouring out their love to Sampa mam, probably one of the best teachers in the world. @iamsrk pic.twitter.com/XEQg7MFTbk
— kishan kuliyal (@KishanlalK) February 19, 2022
Also Read:Pomegranate peel: తొక్కే కదా అని తీసిపారేయకండి.. దానితో లెక్కలేనన్ని ప్రయోజనాలు
Ghost Village: ఆ రిజర్వాయర్‌కు కరువు.. 30 ఏళ్ల తరవాత బయటపడిన ఘోస్ట్ గ్రామం.. భారీగా సందర్శకులు