AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Coorg Tour: కూర్గ్‌ అందాలను చూడాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలివే..

దక్షిణ భారతదేశంలో బాగా పేరొందిన పర్యాటక ప్రాంతాల్లో కూర్గ్‌ జలపాతం (Coorg Water fall) ఒకటి. వాటర్‌ఫాల్‌ చుట్టూ అనేక ప్రకృతి రమణీయ ప్రదేశాలు కూడా ఉన్నాయి.

IRCTC Coorg Tour: కూర్గ్‌ అందాలను చూడాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలివే..
Coorg Waterfalls
Basha Shek
|

Updated on: Feb 20, 2022 | 3:19 PM

Share

దక్షిణ భారతదేశంలో బాగా పేరొందిన పర్యాటక ప్రాంతాల్లో కూర్గ్‌ జలపాతం (Coorg Water fall) ఒకటి. వాటర్‌ఫాల్‌ చుట్టూ అనేక ప్రకృతి రమణీయ ప్రదేశాలు కూడా ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ కొండ ప్రాంతాన్ని మడికెరి అని కూడా పిలుస్తారు. ఈక్రమంలో కూర్గ్‌ అందాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే హైదరాబాద్‌ (Hyderabad) నగర వాసులకు ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. ‘కాఫీ విత్ కర్ణాటక’ పేరుతో అందిస్తోన్న ఈ టూర్‌ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. మొత్తం 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఐదు రోజుల పాటు సాగే ఈ టూర్ ప్యాకేజీలో కూర్గ్‌తో పాటు మంగళూరు అందాలను కూడా చూడవచ్చు. మరి ఈ టూర్ ప్యాకేజీ ఎలా ఉందో చూద్దాం రండి. ఐఆర్‌సీటీసీ టూరిజం కాఫీ విత్ కర్ణాటక టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు మొదటి రోజు ఉదయం 6:05 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కాచిగూడ-మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ ఎక్కాలి. ఆ రోజంతా రైలు ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 9.30 గంటలకు మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. హోటల్‌లో రిఫ్రెష్‌ అయిన తర్వాత మంగళూరు లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. ఇందులో భాగంగా పిలికుల నిసర్ఘధామ, మంగళదేవి ఆలయం, కటీల్ ఆలయం, తన్నీర్‌బావి బీచ్‌ తదితర పర్యాటక ప్రాంతాలను టూరిస్టులు సందర్శించొచ్చు. ఆరోజు రాత్రికి మంగళూరులోనే బస చేయాల్సి ఉంటుంది.

మూడో రోజు ఉదయం కూర్గ్‌కు బయల్దేరాలి. అక్కడకు చేరుకున్న తర్వాత ఓంకారేశ్వర ఆలయం, అబ్బే ఫాల్స్ ను చూడొచ్చు. రాత్రికి కూర్గ్‌లో బస చేయాలి. నాలుగో రోజు ఉదయం కావేరీ నిసర్ఘధామ వెళతారు. మధ్యాహ్నం మడికెరి కోట, రాజాస్ సీట్ ను సందర్శించొచ్చు. రాత్రికి కూర్గ్‌లో బస చేయాలి. ఐదో రోజు ఉదయం హోటల్ నుంచి చెకౌట్ అయిన తర్వాత తలకావేరీ, భాగమండల విజిట్‌ ఉంటుంది. ఆ తర్వాత మంగళూరుకు బయల్దేరాలి. మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో రాత్రి 8.05 గంటలకు రైలు ఎక్కితే ఆరో రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఇక కాఫీ విత్ కర్ణాటక టూర్ ప్యాకేజీ ధరలు కంఫర్డ్‌, స్టాండర్ట్‌ అని రెండు రకాలుగా ఉన్నాయి. స్టాండర్డ్‌ ధరలను పరిశీలిస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.9,230 కాగా డబుల్ ఆక్యుపెన్సీకి రూ.11,570. సింగిల్ ఆక్యుపెన్సీకైతే రూ.20,780 చెల్లించాల్సి ఉంటుంది. ఇక కంఫర్ట్ ప్యాకేజీ ధరలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.12,230 కాగా డబుల్ ఆక్యుపెన్సీకి రూ.14,570, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.23,780 చెల్లించాలి. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్, అవుతాయి. అయితే రైలులో ఆహారం ప్రయాణికులు సొంత ఖర్చులతో కొనాల్సి ఉంటుంది. ఇక సైట్‌సీయింగ్ స్థలాల్లో ఎంట్రెన్స్ టికెట్లు కూడా టూరిస్టులే కొనాలి.

Also Read:Kajal Aggarwal: ఇన్‌స్టాగ్రామ్‌లో టాలీవుడ్‌ చందమామ కొత్త రికార్డు.. త్రో బ్యాక్ ఫొటోతో ఫ్యాన్స్ కు థ్యాంక్స్ చెప్పిన కాజల్..

CM KCR : ముంబై చేరుకున్న సీఎం కేసీఆర్‌.. మరికాసేపట్లో ఉద్దవ్‌ థాకరేతో కీలక భేటీ..

Motorola Frontier: మోటోరోలా నుంచి కొత్త ఫోన్‌.. 194 మెగాపిక్సెల్‌ కెమెరాతో పాటు మరెన్నో అదిరిపోయే ఫీచర్లు.