IRCTC: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ సేవల కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చిన భారతీయ రైల్వే..

IRCTC:  సాధారణంగా ఊరు వెళ్లాలనుకునేవారికి ప్రయాణం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది రైలు. అలాంటిది చివరి క్షణంలో ప్రయాణించేవారికి.. రిజర్వేషన్ కింద టికెట్ దొరకడం చాలా సార్లు అసాధ్యమైనది. ఖర్చు ఎక్కువైనా పర్లేదు అనుకునేవారికి..

IRCTC: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ సేవల కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చిన భారతీయ రైల్వే..
Irctc
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 21, 2022 | 12:25 PM

IRCTC:  సాధారణంగా ఊరు వెళ్లాలనుకునేవారికి ప్రయాణం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది రైలు. అలాంటిది చివరి క్షణంలో ప్రయాణించేవారికి.. రిజర్వేషన్ కింద టికెట్ దొరకడం చాలా సార్లు అసాధ్యమైనది. ఖర్చు ఎక్కువైనా పర్లేదు.. కనీసం తత్కాల్ లోనైనా టికెట్ దొరికితే చాలు అనుకునేవారు చాలా మందే. మనకూ చాలా సార్లు అనుకోని ప్రయాణాలు ఎదురైనప్పుడు ఇలాంటి సమస్య ఎదురయ్యే ఉంటుంది. కానీ.. రైలు ప్రయాణికుల వెసులుబాటు కోసం ఇప్పుడు ఒక ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. అదే Confirm TICKET Mobile App. దీని ద్వారా అత్యవసర ప్రయాణాల సమయంలో ప్రయాణికులు సులువుగా టికెట్ కొనుగోలు చేయవచ్చు. Confirm TICKET అనేది IRCTCకి అధికారిక టికెటింగ్ పార్ట్నర్. ఈ యాప్ సీట్ల లభ్యత, రైళ్ల రాకపోకల వివరాలు వంటి వివరాలను అందించేంది. కానీ ఇప్పుడు ఈ యాప్ ద్వారా ప్రయాణికులు ఈ- టికెట్ కాన్సిలేషన్ వంటి సేవలను అందిస్తుంది.

ప్రస్తుతం ConfirmTICKET Mobile App ద్వారా ప్రయాణికులు తల్కాల్ టికెట్ల కోటా, సీట్ లభ్యత వివరాలను తెలుసుకోవచ్చు. దీనిలో మరో ప్రయోజనం ఏమిటంటే మనం ప్రయాణించాలనుకునే మార్గంలో ప్రయాణించే అన్ని రైళ్ల తల్కాల్ సీట్ల వివరాలను ఒకేసారి ఈ యాప్ చూపిస్తుంది. అందువల్ల ప్రతి రైలులో తత్కాల్ సీట్లు ఉన్నాయా లేవా అని విడివిడిగా చూసుకోవలసిన అవసరం ఇకపై ఉండదు. ఈ యాప్ ను వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యాప్‌లో టిక్కెట్ బుకింగ్ కు సంబంధించి అన్ని అవసరాలను చూసుకునే మాస్టర్ జాబితా కూడా ఉంది. వినియోగదారులు తమ బుకింగ్‌ను నిర్ధారించే ముందు వారి ప్రయాణ వివరాలను సేవ్ చేసుకోవచ్చు. ప్రయాణికులు తుది బుకింగ్‌ను ఎంచుకున్నప్పుడు వివరాలు సేవ్ చేయడం వల్ల సులువుగా బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఆ సమయంలో ప్రయాణికులు ఆన్ లైన్ టికెట్ బుక్ చేసుకుని చెల్లింపులు చేయవచ్చు. ప్రయాణికులు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఇలా యాప్ ద్వారా బుక్ చేసుకున్న తత్కాల్ టికెట్లు కన్ఫమ్ లైదా వెయిటింగ్ లో కూడా ఉండవచ్చు. ఐఆర్‌సిటిసి రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి లేదా వాటి గురించి కేవలం కొన్ని క్లిక్‌లలో విచారించడానికి త్వరితగతిన, సులభమైన, అనుకూలమైన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. టిక్కెట్లకోసం ప్రయాణికులు 24×7 సహాయం కూడా పొందవచ్చని భారతీయ రైల్వేస్ తెలిపింది.

ఇవీ చదవండి..

Asia Markets: ఆసియా మార్కెట్లు భారీగా పతనం.. భారత మార్కెట్లకు నేడు బ్లాక్ మండే అవనుందా.. SGX నిష్టీ సూచీ ఏమి చెబుతోంది.. పూర్తి వివరాలు..

Black Box: బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి.. విమానాల్లో దానిని ఎందుకు అమరుస్తారు.. దీని ఆసక్తికర వివరాలు మీకోసం..