Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

One Plus Smart TV: టీవీ కొనాలనేవారికి బంపర్ ఆఫర్.. రూ.572 చెల్లించండి స్మార్ట్‌టీవీ ఇంటికి తీసుకెళ్లండి..

One Plus Smart TV: స్మార్ట్‌ టీవి కొనాలనేవారికి వన్‌ ప్లస్‌ బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన OnePlus TV Y 1S, OnePlus TV Y1S Edge

One Plus Smart TV: టీవీ కొనాలనేవారికి బంపర్ ఆఫర్.. రూ.572 చెల్లించండి స్మార్ట్‌టీవీ ఇంటికి తీసుకెళ్లండి..
Oneplus Tv Y 1s
Follow us
uppula Raju

|

Updated on: Feb 21, 2022 | 11:46 AM

One Plus Smart TV: స్మార్ట్‌ టీవి కొనాలనేవారికి వన్‌ ప్లస్‌ బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన OnePlus TV Y 1S, OnePlus TV Y1S Edge టీవీల సేల్ ఈ రోజు (21.02.2022) మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ టీవీలు32 ఇంచుల, 43 ఇంచుల డిస్‌ప్లే వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టీవీల అమ్మకాలు జరుగుతాయి. హెచ్‌డీఆర్ 10+, హెచ్‌డీఆర్ 10, హెచ్ఎల్‌జీ సపోర్టుతో డిస్‌ప్లేలు ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి.

OnePlus TV Y1S 32 ఇంచుల డిస్‌ప్లే వేరియంట్ ధర రూ.16,499గా నిర్ణయించారు. 43 ఇంచుల మోడల్ ధర రూ.26,999గా నిర్ణయించారు. అలాగే OnePlus TV Y1S Edge స్మార్ట్ టీవీ 32 ఇంచుల డిస్‌ప్లే ధర రూ.16,999, 43 ఇంచుల టాప్‌ మోడల్ ధర రూ.27,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌లో ఈ టీవీలు మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు.

OnePlus TV Y1S, OnePlus TV Y1S Edge టీవీల కొనుగోలుకు ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. నెలకు రూ.572 చెల్లించి టీవీ కొనుగోలు చేయవచ్చు. ఆరు నెలల ఈఎంఐ ఎంపిక చేసుకుంటే నోకాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ అందుబాటులో ఉంది. మరోవైపు యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.2వేల డిస్కౌంట్ లభిస్తుంది. అంటే బేస్ మోడల్‌ను రూ.14,499కే దక్కించుకోవచ్చు. ఈ రెండు స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. OnePlus TV Y1S టీవీ హెచ్‌డీ రెజల్యూషన్‌ డిస్‌ప్లేతో రాగా.. OnePlus TV Y1S Edge టీవీ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తుంది. HDR 10, HDR 10+ సపోర్టు రెండు టీవీల్లోనూ ఉంది.

Interest Rate: అధిక వడ్డీ పొందాలంటే ఈ 4 బ్యాంకులు సూపర్.. అవేంటంటే..?

Crime News: పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. కాలేజీ విద్యార్థినితో ప్రేమాయణం.. చివరకు ఏమైందంటే..?

AP News: రాయలసీమలో తగ్గతున్న అమ్మాయిల సంఖ్య.. అనంతపురంలో మరీ దారుణం..