Interest Rate: అధిక వడ్డీ పొందాలంటే ఈ 4 బ్యాంకులు సూపర్.. అవేంటంటే..?

Interest Rate: కష్టపడి సంపాదించిన సొమ్ముని ఎవరైనా ఎక్కువ వడ్డీ చెల్లించే బ్యాంకులో డిపాజిట్‌ చేస్తారు. ఇందుకోసం ఏ బ్యాంకు ఎంత వడ్డీ చెల్లిస్తుందో వెతుకుతారు.

Interest Rate: అధిక వడ్డీ పొందాలంటే ఈ 4 బ్యాంకులు సూపర్.. అవేంటంటే..?
Follow us
uppula Raju

|

Updated on: Feb 21, 2022 | 11:26 AM

Interest Rate: కష్టపడి సంపాదించిన సొమ్ముని ఎవరైనా ఎక్కువ వడ్డీ చెల్లించే బ్యాంకులో డిపాజిట్‌ చేస్తారు. ఇందుకోసం ఏ బ్యాంకు ఎంత వడ్డీ చెల్లిస్తుందో వెతుకుతారు. ముఖ్యంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎక్కడైతే ఎక్కువ వడ్డీ ఉంటుందో అక్కడే ఇన్వెస్ట్‌ చేస్తారు. ఇలా చేయడం ద్వారా వారి డబ్బుకు ఎలాంటి రిస్క్ ఉండదు. అలాగే కచ్చితమైన రాబడి పొందొచ్చు. అయితే బ్యాంక్ ప్రాతిపదికన వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. అందులో ఈ నాలుగు ప్రైవేట్‌ బ్యాంకులు అధిక వడ్డీ చెల్లిస్తున్నాయి. ఆర్బీఐ నిబంధనల వల్ల ప్రస్తుతం మార్కెట్‌లో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి బ్యాంకులు డిపాజిట్ దారులకు మూడేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై తక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి. అయితే ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బంధన్ బ్యాంక్‌ , ఆర్‌బీఎల్ బ్యాంక్, యస్‌ బ్యాంకు ఎక్కువ వడ్డీ రేట్లని ఆఫర్ చేస్తున్నాయి.

ఇండస్ ఇండ్ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్‌కు 2 ఏళ్ల నుంచి 61 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై 7 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఈ రేట్లు ఫిబ్రవరి 16 నుంచి అమలులోకి వచ్చాయి. అలాగే ఆర్‌బీఎల్ బ్యాంక్ కూడా 24 నెలల నుంచి 36 నెలలలోపు ఎఫ్‌డీలపై 7 శాతం వడ్డీని ఇస్తోంది. ఫిబ్రవరి 3 నుంచి ఈ రేట్లు అమలులో ఉన్నాయి. యస్ బ్యాంక్ కూడా మూడేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. జనవరి 4 నుంచి ఈ రేట్లు అమలులోకి వచ్చాయి.

బంధన్ బ్యాంక్ కూడా 7 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. 2 ఏళ్ల నుంచి మూడేళ్లలోపు ఎఫ్‌డీలపై జనవరి 12 నుంచి పెరిగిన వడ్డీ రేట్లని అందిస్తుంది. ఈ బ్యాంకులలో డిపాజిట్‌ చేసేముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. డీఐసీజీసీ కింద ఈ బెనిఫిట్ ఉంటుంది. అంటే బ్యాంక్ దివాలా తీస్తే అప్పుడు మీకు రూ.5 లక్షల వరకు డబ్బులకు రక్షణ ఉంటుంది. అందుకే ఒక బ్యాంక్‌లో రూ.5 లక్షల వరకు ఎఫ్‌డీ చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఈ పెరిగిన వడ్డీ రేట్లు కలిసి వస్తాయి.

Crime News: పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. కాలేజీ విద్యార్థినితో ప్రేమాయణం.. చివరకు ఏమైందంటే..?

AP News: రాయలసీమలో తగ్గతున్న అమ్మాయిల సంఖ్య.. అనంతపురంలో మరీ దారుణం..

Tamil Bigg Boss: తమిళ ‘బిగ్‌బాస్‌’ హోస్ట్‌ నుంచి తప్పుకున్న కమల్‌హాసన్.. కారణం ఇదేనట..!