Tamil Bigg Boss: తమిళ ‘బిగ్‌బాస్‌’ హోస్ట్‌ నుంచి తప్పుకున్న కమల్‌హాసన్.. కారణం ఇదేనట..!

Tamil Bigg Boss: ‘బిగ్‌బాస్‌’ షో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళంలో కూడా మంచి పాపులారిటీ సంపాదించింది. టీఆర్పీ రేటింగ్‌లో అన్ని షోల కంటే

Tamil Bigg Boss: తమిళ 'బిగ్‌బాస్‌' హోస్ట్‌ నుంచి తప్పుకున్న కమల్‌హాసన్.. కారణం ఇదేనట..!
Kamal Haasan
Follow us
uppula Raju

|

Updated on: Feb 21, 2022 | 9:10 AM

Tamil Bigg Boss: ‘బిగ్‌బాస్‌’ షో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళంలో కూడా మంచి పాపులారిటీ సంపాదించింది. టీఆర్పీ రేటింగ్‌లో అన్ని షోల కంటే ముందువరుసలో ఉంటుంది. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు కూడా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలకు కొదువలేదు. అందుకే బిగ్‌బాస్‌ షో చాలా హిట్‌ అయింది. అయితే తెలుగు బిగ్‌బాస్‌ షోకి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, తమిళ బిగ్‌బాస్‌కి విశ్వనటుడు కమల్‌హాసన్‌ హోస్ట్‌గా చేస్తున్నారు. అయితే ఇటీవల కమల్‌ ఈ హోస్ట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీనికి కారణాలను కూడా వెల్లడించారు.

కమల్‌హాసన్‌ ‘బిగ్‌బాస్‌’ షో హోస్ట్‌ నుంచి తప్పుకున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘కరోనా పరిస్థితులు ‘విక్రమ్‌’ సినిమాపై ప్రభావం చూపాయి. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోయాం. దీంతో నేను హోస్ట్‌గా చేస్తున్న ‘బిగ్‌బాస్‌’ షో, ‘విక్రమ్‌’ సినిమా డేట్స్‌ క్లాష్‌ అయ్యాయి. అందుకే ‘బిగ్‌బాస్‌’ హోస్ట్‌ నుంచి తప్పుకుంటున్నాను. యాజమాన్యంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను’’ అని ప్రకటించారు.

న‌గ‌రం, ఖైది, మాస్టర్ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల‌తో ద‌ర్శకుడు లోకేశ్ క‌న‌క‌రాజ్ దర్శకత్వంలో విక్రమ్‌ సినిమా రూపొందుతుంది. ఇందులో కమల్‌ హాసన్‌తో పాటు విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. టీజ‌ర్‌, ఫస్ట్ గ్లాన్స్ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచేశాయి. క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తోన్న 232వ చిత్రమిది. సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ డిఫ‌రెంట్ పాత్రలో క‌నిపించ‌నున్నారు. మెలితిప్పిన మీసాలు, గ‌డ్డంతో అభిమానులను అలరించనున్నారు.

Crime News: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. టైర్‌ పేలి బస్సు బోల్తా..

Viral Video: ఔరా..! ఉడుము ఎంత పని చేసింది.. రెస్టారెంట్‌లోకి దూరి మహిళకు చుక్కలు చూపించిన ఉడుము.. వైరల్ అవుతున్న వీడియో..

Andhra Pradesh: టాలీవుడ్‌కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. పెరగనున్న టికెట్ రేట్లు.. ఇవాళో రేపో జీవో జారీ..

బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!