Viral Video: ఔరా..! ఉడుము ఎంత పని చేసింది.. రెస్టారెంట్‌లోకి దూరి మహిళకు చుక్కలు చూపించిన ఉడుము.. వైరల్ అవుతున్న వీడియో..
ఉడుమును చూడగానే ఎవరికైనా భయం కలుగుతుంది. వాటి నాలిక పాము నాలికలా ఉంటుంది. అది దాడి చేస్తుందేమో అని భయపడతాం. అలాంటి ఓ ఉడుము ఓ మహిళను బాగా భయపెట్టింది. చైర్‌పై కెక్కినా కూడా ఆమెలో భయం పోలేదు. బిగ్గరగా అరుస్తూ గోల చేసింది వలవలా ఏడ్చేసింది.
ఉడుమును చూడగానే ఎవరికైనా భయం కలుగుతుంది. వాటి నాలిక పాము నాలికలా ఉంటుంది. అది దాడి చేస్తుందేమో అని భయపడతాం. అలాంటి ఓ ఉడుము ఓ మహిళను బాగా భయపెట్టింది. చైర్‌పై కెక్కినా కూడా ఆమెలో భయం పోలేదు. బిగ్గరగా అరుస్తూ గోల చేసింది వలవలా ఏడ్చేసింది. థాయిలాండ్‌లోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన ఈ ఘటన వైరల్ అయ్యింది. స్టోర్ లోని యువకుడు ఉడుమును కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాడు. దాన్ని పట్టుకుందామని ట్రై చేశాడు. కానీ తోక వైపు అతని చెయ్యి వెళ్లిన ప్రతిసారీ ఆ ఉడుము అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఓ దశలో అతను తన చెప్పు తీసి దాన్ని కంట్రోల్ చెయ్యబోయాడు. అయినా ఆ ఉడుము లొంగలేదు. ఉడుము తలపై ఓ కర్రను బలంగా ఉంచాడు. అలా ఉడుమును ఈడ్చుకుంటూ తీసుకుపోయాడు. అప్పటికే ఏడుపు ఆపిన ఆమె… కళ్లు తుడుచుకుంటూ… చివర్లో రిలీఫ్ పొందినట్లు ఫీలవుతూ నవ్వేసింది. వీడియోలో ఓ ఇద్దరమ్మాయిలు బయట నుంచి తొంగి చూశారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

