AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: టాలీవుడ్‌కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. పెరగనున్న టికెట్ రేట్లు.. ఇవాళో రేపో జీవో జారీ..

AP Government: ఆంధప్రదేశ్‌లో దాదాపు ఆర్నెల్లుగా సినిమా టికెట్ రేట్ల వివాదం నడుస్తోంది. ఇది మామూలుగానే స్టార్ట్‌ అయినా, ఆ తర్వాత దీనికి రాజకీయ రంగు అంటుకుంది.

Andhra Pradesh: టాలీవుడ్‌కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. పెరగనున్న టికెట్ రేట్లు.. ఇవాళో రేపో జీవో జారీ..
Shaik Madar Saheb
|

Updated on: Feb 21, 2022 | 9:58 AM

Share

AP Government: ఆంధప్రదేశ్‌లో దాదాపు ఆర్నెల్లుగా సినిమా టికెట్ రేట్ల వివాదం నడుస్తోంది. ఇది మామూలుగానే స్టార్ట్‌ అయినా, ఆ తర్వాత దీనికి రాజకీయ రంగు అంటుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, జనసేన-వైసీపీ మధ్య మాటల యుద్ధమే జరిగింది. పవన్‌ వర్సెస్‌ పేర్ని నాని కామెంట్స్‌తో ఈ ఇష్యూ పీక్స్‌కు వెళ్లింది. ఇదిలా ఉండగానే ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్‌ చిరంజీవి. ఒకసారి పర్సనల్‌గా, మరోసారి గ్రూప్‌గా వచ్చి సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఆ టైంలో ఫిబ్రవరి నెలాఖరుకల్లా గుడ్‌న్యూస్‌ వింటారని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని చెప్పారు చిరు. అన్నట్టుగానే టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం (AP Government) నుంచి గుడ్‌న్యూస్ రాబోతుంది. ఏపీలో సినిమా టికెట్ రేట్ల (Movie Ticket Rates) పెంపునకు దాదాపు ముహూర్తం ఖరారైంది. కొత్త రేట్లపై జగన్ ప్రభుత్వం ఈ రోజు లేదా రేపు జీవో జారీ చేయనుంది. ప్రేక్షకులతో పాటు చిత్ర పరిశ్రమకు ఇబ్బంది లేకుండా ధరలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా టికెట్ల కమిటీ నివేదిక సీఎం జగన్‌కు చేరిందని.. ఈ రోజు లేదా రేపు వచ్చే అవకాశముందని పేర్కొంటున్నాయి అధికార వర్గాలు.

అయితే, ఈ వివాదంపై కోర్టులో పిటిషన్‌ వేశారు. ఇంకా తుది తీర్పు రాలేదు. కమిటీ ఫిక్స్‌ చేసిన రేట్లను కోర్టుకు సమర్పించాకా, న్యాయస్థానం అనుమతితో జీవో విడుదల చేసే ఛాన్స్‌ ఉంది. మినిమం ప్రైస్ 40 రూపాయలు, మాగ్జిమమ్ ప్రైస్ 140గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పంచాయతీలు, నగర పంచాయతీలను ఒకే కేటగిరీగా తీసుకొస్తున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా మొత్తం మూడు కేటగిరీలో నాన్ ఏసీ, ఎయిర్ కూల్, ఏసీ థియేటర్లగా రేట్లు నిర్ధారించింది కమిటీ. నాన్‌ ఏసీ థియేటర్లలో మినిమం 40 రూపాయలు, ఏసీ థియేటర్లలో మినిమం 70 రూపాయలుగా ఖరారు చేసినట్టు తెలిసింది.

ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే థియేటర్లకు ప్రత్యేక ధరలను సూచించినట్లు తెలుస్తుంది. చిన్న సినిమాలకు ఐదో షోకు అనుమతి, 75 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు మల్టీప్లెక్స్ థియేటర్లలో 20 శాతం సీట్లు లోయర్ కేటగిరీగా కేటాయించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఆమోదం తర్వాత ప్రభుత్వం జీవో జారీ చేయనుందని.. దీనిపై ఈరోజు లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశముందని సమాచారం.

Also Read:

PM Narendra Modi: అలా అస్సలు చేయొద్దు.. బీజేపీ నేతకు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..

President Vizag Tour: నేడు విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ.. రాష్ట్రపతికి నౌకాదళ, ఎయిర్ క్రాప్టుల సెల్యూట్ విన్యాసాలు