President Vizag Tour: నేడు విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ.. రాష్ట్రపతికి నౌకాదళ, ఎయిర్ క్రాప్టుల సెల్యూట్ విన్యాసాలు

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖపట్నం చేరుకున్నారు. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖ వచ్చిన రాష్ట్రపతికి ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది.

President Vizag Tour: నేడు విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ.. రాష్ట్రపతికి నౌకాదళ, ఎయిర్ క్రాప్టుల సెల్యూట్ విన్యాసాలు
President
Follow us

|

Updated on: Feb 21, 2022 | 8:04 AM

President Ram Nath Kovind Vizag Tour: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖపట్నం(Visakhapatnam) చేరుకున్నారు. ప్రెసిడెంట్ నావల్ ఫ్లీట్ రివ్యూ(Naval Fleet Review) కోసం విశాఖ వచ్చిన రాష్ట్రపతికి ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan MOhan Reddy) ఆయనకు ఘనస్వాగతంపలికారు. బంగాళాఖాతంలో రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ-22ను నిర్వహించనున్న తూర్పు నౌకాదళ కమాండ్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం విశాఖకు చేరుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని, ‘ఇండియన్ నేవీ – 75 ఏళ్ల దేశ సేవ’ అనేది PFR-22 థీమ్‌గా చేయడం జరిగింది. సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా, ప్రతి భారత రాష్ట్రపతి తన ఐదేళ్ల కాలంలో భారత నావికాదళాన్ని ఒకసారి సమీక్షిస్తారు

సాయంత్రం భువనేశ్వర్‌ నుంచి స్పెషల్‌ ఫ్లైట్‌లో విశాఖ వచ్చారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. రాష్ట్రపతికి సీఎం వైఎస్‌ జగన్ స్వాగతం పలికారు. ఆ తర్వాత.. సీఎం జగన్ తిరుగుపయనమయ్యారు. రాష్ట్రపతి ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి వెళ్లారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రెసిడెన్షియల్ ఫ్లీట్‌ రివ్యూలో రాష్ట్రపతి పాల్గొంటారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. రెండు వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. యుద్ధ నౌకల సమీక్ష కూడా ఉండనుంది. ఆర్‌కెబీచ్‌కు దగ్గరలో ఈ కార్యక్రమం జరగనుంది. రోడ్లపై ఎలాంటి ఆంక్షల్లేవని చెబుతున్నారు పోలీసులు.

గతంలో కూడా విశాఖ కేంద్రంగా.. ఫ్లీట్ రివ్యూ.. జరిగింది. PFR భారత నావికాదళం సంసిద్ధత, అధిక ధైర్యాన్ని, క్రమశిక్షణకు దేశానికి భరోసా ఇవ్వడానికి ఉద్దేశించింది. 2006లో మెుదటిసారి ఫ్లీట్ రివ్యూ జరగ్గా.. ప్రెసిడెంట్.. ఏపీజే అబ్దుల్‌ కలాం భారత నౌకాదళ సామర్థ్యాన్ని సమీక్షించారు. ఆ తర్వాత 2016లోనూ అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ నిర్వహించారు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వచ్చారు. ప్రణబ్ విశాఖపట్నంలో సిటీ ఆఫ్ డెస్టినీగా పిలవబడే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను పరిశీలించారు. త్రివిధ దళాల అధిపతిగా భారత నావికాదళ సామర్ధ్యాన్ని రాష్ట్రపతి రేపు సమీక్షించనున్నారు. ప్రతి రాష్ట్రపతి తన పదవీ కాలంలో నావికాదళ సామర్ధ్యాన్ని సమీక్షించడం ఆనవాయితీ. 12వ ఫ్లీట్ రివ్యూను ఈసారి తూర్పు తీర నావికాదళం నిర్వహిస్తోంది. ఈ రివ్యూకి రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. విశాఖపట్నం PFRను నిర్వహించడం ఇది రెండోసారి.

PFR-22లో భాగంగా, కోవింద్ నౌకాదళానికి చెందిన రెండు నౌకాదళాలను, యుద్ధనౌకలు మరియు కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌తో కూడిన 60 నౌకలు మరియు 10,000 మంది సిబ్బందితో కూడిన జలాంతర్గాములను సమీక్షిస్తారు. అలాగే, 50 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఈవెంట్‌లో భాగంగా ఉంటాయి, ఇందులో వారు ఫ్లై-పాస్ట్ నిర్వహిస్తారు.

రాష్ట్రపతి స్వదేశీంగా నిర్మించిన నావల్ ఆఫ్‌షోర్ పెట్రోలింగ్ నౌక INS సుమిత్రను ప్రత్యేకంగా ‘ప్రెసిడెన్షియల్ యాచ్’గా నియమించారు. విశాఖపట్నం తీరంలో నాలుగు ఖచ్చితమైన నిలువు వరుసలలో లంగరు వేసిన అన్ని పాల్గొనే నౌకలను సమీక్షిస్తారు. నేవీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం. ఇండియన్ నేవీ ఏవియేషన్ విభాగంలో పనిచేస్తున్న అన్ని విమానాలు ఫ్లై-పాస్ట్‌లో పాల్గొంటాయి. ఇందులో Mikoyan MiG-29K, బోయింగ్ P-8I నెప్ట్యూన్, HAL ధృవ్ MKIII వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు ఉన్నాయి. మూడు నెలల క్రితమే నౌకాదళంలో చేరిన ఐ ఎన్ ఎస్ విశాఖ కూడా ఉన్నట్లు నేవీ అధికారులు తెలిపారు. ఫ్లైపాస్ట్ తర్వాత, మెరైన్ కమాండోలు (మార్కోస్) యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్, సెర్చ్ అండ్ రెస్క్యూ డ్రిల్, కొన్ని జలాంతర్గాముల ద్వారా స్టీమ్-పాస్ట్ ప్రదర్శిస్తారని నేవీ తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రత్యేకంగా రూపొందించిన ఫస్ట్ డే కవర్‌ను, స్మారక స్టాంపును కూడా విడుదల చేస్తారు.

ఐ ఎన్ ఎస్ విశాఖ ప్రత్యేకతలు

  1. తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం పేరుతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ముంబైలోని మజ్‌గావ్‌ డాక్‌యార్డులో తయారైన ఐ ఎన్ ఎస్ విశాఖ
  2. రూ.9 వేల కోట్లు ఖర్చు తో భారత నావికాదళం అమ్ముల పొదిలో చేరిన అస్త్రం ఐ ఎన్ ఎస్ విశాఖ
  3. గుట్టు చప్పుడు కాకుండా శత్రునౌకలపై విరుచుకుపడి సర్వనాశనం చేసే అతిపెద్ద డిస్ట్రాయర్‌ ఐ ఎన్ ఎస్ విశాఖ

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన వివరాలు..

  1. 9.07 కి ఐ ఎన్ ఎస్ సుమిత్ర ను అధిరోహించనున్న రాష్ట్రపతి
  2. 9.34 నుంచి 10. 43 వరకు యుద్ధ నౌకల సమీక్ష, మధ్యలో పెరేడ్ సెయిల్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ డెమో, హాక్ డెమో
  3. 10.44 నుంచి 10. 52 వరకు ఫ్లై ఫాస్ట్, ఏకకాలంలో ఎగిరి సుప్రీం కమాండర్ కి సెల్యూట్ చేయనున్న యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు
  4. 10.53 నుంచి 10.57 వరకు సబ్ మెరైన్ ల సమీక్ష
  5. 10.58 నుంచి 11.02 వరకు మెరైన్ కమాండో ల విన్యాసాలు
  6. 11.08 నుంచి 11.13 వరకు రాష్ట్రపతి ప్రసంగం
  7. నౌకాదళ అధికారులతో గ్రూప్‌ ఫొటో, తపాలా బిళ్ల, పోస్టల్‌ కవర్‌ ఆవిష్కరణ తర్వాత 11.45 కి నిష్క్రమించనున్న రాష్ట్రపతి

Read Also…  Black Box: బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి.. విమానాల్లో దానిని ఎందుకు అమరుస్తారు.. దీని ఆసక్తికర వివరాలు మీకోసం..