petrol, diesel: ప్రజలకు షాక్ ఇవ్వనున్న పెట్రోలియం కంపెనీలు.. ఎప్పుడంటే..

Fuel prices: పెట్రోలియం కంపెనీలు త్వరలో సామాన్యులకు షాక్ ఇవ్వనున్నాయి...

petrol, diesel: ప్రజలకు షాక్ ఇవ్వనున్న పెట్రోలియం కంపెనీలు.. ఎప్పుడంటే..
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 21, 2022 | 8:30 AM

Fuel prices: పెట్రోలియం కంపెనీలు త్వరలో సామాన్యులకు షాక్ ఇవ్వనున్నాయి. గత ఏడాది నవంబర్ 4కు ముందు భారత్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను రోజుకు ఇంత అని పెంచుతూ వచ్చిన కేంద్రం ఆ తర్వాత ఇప్పటి వరకు పెంచనే లేదు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతో పెంపు జోలికే వెళ్లలేదు. అయితే మార్చి 7న ఉత్తర్‌ప్రదేశ్‌లో చివరి విడత ఎన్నికలు ముగియడంతోనే మళ్లీ వీటి ధరల మోత మోగనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్‌పై లీటర్‌కు ఏకంగా 8 నుంచి 9రూపాయలు పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

సాధారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. ముడి చమురు ధరలు పెరిగితే భారత్‌లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను దేశీయ చమురు కంపెనీలు పెంచుతాయి. అలాంటిది నవంబర్‌ 4 నుంచి ఇప్పటి వరకు భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు మాటే లేదు. ఈ కాలంలో బ్యారెల్‌ ముడి చమురు ధర 14 డాలర్లు పెరిగి 94 డాలర్లకు చేరింది. త్వరలో వంద డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు.

సాధారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు ఒక డాలర్‌ పెరిగితే భారత్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు లీటర్‌కు 45 పైసలు పెరగాలి. నవంబర్‌ 4 నుంచి పెరిగిన బ్యారెల్‌ ధరలను లెక్కవేస్తే భారత్‌లో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 6 రూపాయలకు పైగా పెరగాలి. దీనికి వ్యాట్‌ వంటి పన్నులను కలిపితే అది 8 రూపాయలకు చేరుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ఆ నష్టాన్ని భరిస్తూ వచ్చిన కేంద్రం….అవి ముగిసిన వెంటనే ఆ 8 రూపాయల భారం సామాన్యుడిపై వేసేందుకు సిద్ధం అవుతోంది.

Read Also.. Gold, Silver Price Today: వినియోగదారులకు షాకిస్తున్న బంగారం, వెండి.. పెరిగిన ధరలు

పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత సహా 10 మంది మృతి
పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత సహా 10 మంది మృతి
TGPSC గ్రూప్ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ, ఫలితాలు వచ్చేది అప్పుడే...?
TGPSC గ్రూప్ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ, ఫలితాలు వచ్చేది అప్పుడే...?
నేటి నుంచి RID గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు హాజరు కానున్న ప్రముఖులు
నేటి నుంచి RID గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు హాజరు కానున్న ప్రముఖులు
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా..ఎక్కడ చూడొచ్చంటే?
అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్ కొత్త సినిమా..ఎక్కడ చూడొచ్చంటే?
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..
గోల్డ్ లవర్స్‌కు గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..
సల్మాన్ ఖాన్ నోట మహేష్ బాబు మాట..
సల్మాన్ ఖాన్ నోట మహేష్ బాబు మాట..
ఆ ఆలయంలో నీరు అద్భుతం.. నత్తి, చర్మ వ్యాధులు నయం చేసే శక్తి
ఆ ఆలయంలో నీరు అద్భుతం.. నత్తి, చర్మ వ్యాధులు నయం చేసే శక్తి
తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
తిరుమలలో ప్రియుడితో కలిసి అలాంటి పనులు.. బిగ్ బాస్ బ్యూటీపై ఫైర్
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
దర్శ అమావాస్య రాత్రి ఈ పరిహారాలు చేయండి.. అన్ని బాధలు తొలగిపోతాయి
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు
నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ప్రిలిమినరీ కీ వచ్చేసింది.. త్వరలో ఫలితాలు