Asia Markets: ఆసియా మార్కెట్లు భారీగా పతనం.. భారత మార్కెట్లకు నేడు బ్లాక్ మండే అవనుందా.. SGX నిష్టీ సూచీ ఏమి చెబుతోంది.. పూర్తి వివరాలు..

Asia Markets: భారత్ మార్కెట్లో మరో బ్లాక్ మండే అయ్యే అవకాశం ఉందా. అసలు దానికి కారణమవుతున్న అంశాలు ఏమిటి. ఆసియా మార్కెట్లు నెగెటివ్ సెంటిమెంట్లతో ఓపెన్ అవుతాయా.. విశ్లేషణాత్మక కథనం మీకోసం..

Asia Markets: ఆసియా మార్కెట్లు భారీగా పతనం.. భారత మార్కెట్లకు నేడు బ్లాక్ మండే అవనుందా.. SGX నిష్టీ సూచీ ఏమి చెబుతోంది.. పూర్తి వివరాలు..
Asia Markets
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 21, 2022 | 8:19 AM

Asia Markets: భారత్ మార్కెట్లో మరో బ్లాక్ మండే అయ్యే అవకాశం ఉందా. అసలు దానికి కారణమవుతున్న అంశాలు ఏమిటి. ఆసియా మార్కెట్లు నెగెటివ్ సెంటిమెంట్లతో ఓపెన్ అవుతాయా.. విశ్లేషణాత్మక కథనం మీకోసం.. బెలారస్‌లో సైనిక కసరత్తులను విస్తరించడం ద్వారా రష్యా అధిక స్థాయి దౌత్య ఆటలో ముందంజ వేసింది. దీనికి సంబంధించిన తాజా ఉపగ్రహ చిత్రాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లోని వాస్తవ పరిస్థితుల తీవ్రతను వివరిస్తున్నాయి. రష్యా మరింత దూకుడుగా సైన్యం సంఖ్యను పెంచుతున్న విషయం ఈ చిత్రాలు చూపుతున్నాయి. ఈ కారణాలతో ఆసియా మార్కెట్లు మరింతగా పతనమయ్యాయి. యుద్ధ భయాలతో వారం ప్రారంభంలోనే మార్కెట్లు ఎరుపురంగును సంతరించుకున్నాయి. దీనికి తోడు ప్రపంచనలోని రెండవ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి కేంద్రంగా ఉన్న రష్యా ప్రస్తుతం యుద్ధభూమిలో ఉండడం.. ఉక్రెయిన్ ను ఆక్రమించనుందని వార్తలు రావడంతో పాటు అమెరికా ఆంక్షలు విధించనుందన్న ఊహాగానాల మధ్య క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి.

దీని వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దీనికి తోడు ఇప్పటికే పెద్ద సమస్యగా ఉన్న పెరిగిన ద్రవ్యోల్బణం.. పెరుగుతున్న బాండ్ల వడ్డీ రేట్లు జతకట్టడంతో స్టాక్ మార్కెట్లతో అనిశ్ఛితి ఊహించని స్థాయిలో పెరిగింది. ఇప్పటికే SGX నిష్టీ సూచీ 144 పాయింట్ల గ్యాప్ డౌన్ తో ప్రారంభం కావడంతో భారత మార్కెట్లు సైతం నెగెటివ్ సెంటిమెంట్ తో ప్రారంభం కానున్నట్లు ప్రాథమికంగా అర్థమవుతోంది.

అమెరికా ట్రెజరీ ఫ్యూచర్స్ వివరాల ప్రకారం చమురు ధరలు దాదాపు 2% పెరిగాయి. S&P 500 ఫ్యూచర్స్ 0.6% పడిపోయాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు నేడు సెలవులో ఉన్నప్పటికీ.. ఫ్యూచర్స్ మాత్రం ట్రేడ్ అవుతూనే ఉన్నాయి. అక్కడి నాస్డాక్ స్టాక్ ఎంక్ఛేంజ్ లో ఫ్యూచర్స్ 1.2% పడిపోయాయి. జపాన్ వెలుపల MSCI యొక్క ఆసియా-పసిఫిక్ షేర్ల విస్తృత సూచిక 0.4% పడిపోగా.. జపాన్ మార్కెట్ సూచీ Nikkei 1.9% మేర నష్టపోయింది. మార్కెట్ అనిశ్చితుల మధ్య బంగారం సైతం తొమ్మిది నెలల గరిష్ఠానికి చేరుకుని ఔన్సు బంగారం ధర 1903 డాలర్లను చేరుకుంది.

ఇవీ చదవండి.. Black Box: బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి.. విమానాల్లో దానిని ఎందుకు అమరుస్తారు.. దీని ఆసక్తికర వివరాలు మీకోసం..

Multibagger Stock: రూ. లక్షను.. రూ. 65 లక్షలు చేసిన మల్టీ బ్యాగర్ స్టాక్.. బ్రోకరేజ్ సంస్థలు టార్గెట్ ఎంత ఇచ్చాయంటే..