Alert: స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక.. సేవలు పొందాలంటే అలా చేయడం ఇక తప్పనిసరి.. ట్విట్టర్ లో SBI ఏమి చెప్పిందంటే..
Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. అనేక మంది తమ బ్యాంకింగ్ సేవలకోసం ఎంచుకునే నమ్మకమైన సంస్థ. కొత్తతరం సాంకేతికత వినియోగంతో కస్టమర్లకు ఎప్పుడూ సేవలు అందిస్తూ మన్ననలు పొందుతున్న అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం..
Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. అనేక మంది తమ బ్యాంకింగ్ సేవలకోసం ఎంచుకునే నమ్మకమైన సంస్థ. కొత్తతరం సాంకేతికత వినియోగంతో కస్టమర్లకు ఎప్పుడూ సేవలు అందిస్తూ మన్ననలు పొందుతున్న అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం.. ఇప్పుడు తమ ఖాతాదారులనకు విజ్ఞప్తి చేసింది. అదేమిటంటే.. ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్యాంకింగ్ సేవలు పొందేందుకు మార్చి చివరినాటి కల్లా వినియోగదారుల తమ ఆధార్ కార్డును.. పాన్ కార్డుకు లింక్ చేయడాన్ని పూర్తి చేయాలని సూచించింది. అలా చేయని వారు సేవలు పొందడంలో ఇబ్బంది పడతారని హెచ్చరించింది. అందువల్ల నిరంతరాయంగా తమ నుంచి బ్యా్ంకింగ్ సేవలను పొందేదుకు ప్రతి ఖాతాదారుడు తప్పనిసరిగా పాన్- ఆథార్ లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ట్విట్టర్ వేదికగా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన గడువులోగా ఆధార్‌తో సీడ్ చేయని పాన్ కార్డులు చెల్లనివిగా పరిగణించబడతాయని ఎస్ బీఐ గుర్తుచేసింది.
We advise our customers to link their PAN with Aadhaar to avoid any inconvenience and continue enjoying a seamless banking service.#ImportantNotice #AadhaarLinking #Pancard #AadhaarCard #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/Qp9ZBqG4Xh
— State Bank of India (@TheOfficialSBI) February 18, 2022
పాన్ కార్డును ఆధార్ కు లింక్ చేయడం ఎలాగంటే..
1. ముందుగా వినియోగదారుడు ఆదాయపన్ను శాఖకు సంబంధించిన e-filing వెబ్ సైట్ కు వెళ్లాలి.
2. తరువాత Link Aadhaar సెక్షన్ ను ఎంపికచేసుకోవాలి.
3. అక్కడ వినియోగదారుడు తన పాన్ నంబరు, ఆథార్ నంబరును, తన పేరు వివరాలను నింపాలి.
4. ఆ తరువాత అక్కడ ఉండే Link Aadhaar ఆప్షన్ ను క్లిక్ చేయడంతో.. వివరాలను ఆదాయపన్ను శాఖ సరిపోల్చడం పూర్తయ్యాక ఆ ప్రక్రియ సులభంగా పూర్తి చేయబడుతుంది.
కరోనా కారణంగా ఇప్పటికే అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం ఆధార్ పాన్ అనుసంధానికి సంబంధించిన గడువును అనేక మార్లు పెంచింది. తాజాగా ఈ అవకాశం మార్చి 31 2022 తో ముగియనుంది. గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే.. ఆ తరువాత పాన్ కార్డులు పనిచేయవని, నిరుపయోగంగా మారతాయని ఇప్పటికే స్పష్టం చేసింది. ఆదాయపన్ను చట్టం 1961 కింద సెక్షన్- 139AA కింద ఈ ప్రక్రియ తప్పనిసరి. జనవరి 24 నాటికి దేశంలో 43.34 కోట్ల మంది ఈ ప్రక్రియను పూర్తిచేసినట్లు పార్లమెంటులో ఆర్థిక శాఖ వెల్లడించింది.
ఇవీ చదవండి..