EPFO: ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త పెన్షన్ స్కీమ్.? వివరాలివే..
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) త్వరలోనే మరో గుడ్ న్యూస్ అందించనుంది. రూ. 15 వేలు అంతకంటే ఎక్కువ వేతనం...

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) త్వరలోనే మరో గుడ్ న్యూస్ అందించనుంది. రూ. 15 వేలు అంతకంటే ఎక్కువ వేతనం ఉన్న సంఘటిత కార్మికుల కోసం కొత్త పెన్షన్ స్కీమ్‌ను అమలులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ పలు కీలక అంశాలను తాజాగా వెల్లడించింది. సంఘటిత రంగంలో రూ. 15 వేలు అంతకంటే ఎక్కువ వేతనం ఉన్నవారితో పాటు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్(ఈపీఎస్-95) కింద కవర్ కాని ఉద్యోగుల కోసం ఈ కొత్త పెన్షన్ పధకాన్ని అమలులోకి తీసుకొచ్చేలా ఈపీఎఫ్ఓ చూస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఈపీఎస్-95 కింద పించన్ జమలకు రూ. 15 వేల వరకు మూలవేతనాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. దీని వల్ల రూ. 15 వేల కంటే ఎక్కువ జీతాన్ని తీసుకుంటున్నవారు ఈపీఎస్-95లోకి పరిధిలోకి వచ్చినా.. పెన్షన్ తక్కువ జమ(8.33 శాతం) అవుతుంది. అందుకే కొత్త పెన్షన్ స్కీంను అమలులోకి తీసుకొచ్చేందుకు పరిశీలనలో ఉంచారు. రూ. 15 వేల కంటే ఎక్కువ మూలవేతనం ఉన్నవారికి కూడా లాభదాయకంగా ఉండేలా మార్పులు చేసేందుకు ఈపీఎఫ్ఓ కసరత్తులు చేస్తోంది. వచ్చే నెల 11,12 తేదీల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Viral Video: చిరుత మాదిరిగా డేగ వేట.. సీన్ మాములుగా లేదుగా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!