BSNL Plans: తక్కువ ధర.. ఎక్కువ బెనిఫిట్స్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ప్లాన్‌లు..!

BSNL Plans: ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్ల కోసం అదిరిపోయే ఆఫర్లని ప్రకటించింది. ప్రైవేట్‌ టెలికాం కంపెనీలైన

BSNL Plans: తక్కువ ధర.. ఎక్కువ బెనిఫిట్స్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ప్లాన్‌లు..!
రూ. 200 కంటే తక్కువ ధరలో వచ్చే ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజు 1 GB ఇంటర్నెట్ డేటాను పొందుతారు. ఇందులో 100 SMSలు ఉచితం. వాటిలో వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి.
Follow us
uppula Raju

|

Updated on: Feb 21, 2022 | 12:30 PM

BSNL Plans: ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్ల కోసం అదిరిపోయే ఆఫర్లని ప్రకటించింది. ప్రైవేట్‌ టెలికాం కంపెనీలైన ఎయిర్‌టెల్‌, జియో, వొడాఫోన్ వంటి వాటితో పోల్చుకుంటే ధర తక్కువ, బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. దాదాపు అన్ని రేంజ్‌ల్లో మంచి ప్రయోజనాలను అందిస్తోంది. గత కొన్ని రోజుల క్రితం ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు ధరలను పెంచడంతో చాలామంది ఇప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త కొత్త ఆఫర్లని కూడా ప్రకటిస్తుంది.

BSNL STV 49 Planతో మంచి బెనిఫిట్స్ అందిస్తోంది. 24 రోజుల వ్యాలిడిటీతో 2జీబీ డేటా, 100 నిమిషాల వాయిస్ కాల్స్ వస్తాయి. మొబైల్‌ తక్కువగా వినియోగించే వారికి ఈ ప్లాన్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే BSNL STV 99 Plan తో రీచార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ కాలపరిమితి 22రోజులు. అయితే ఇందులో డేటా లభించదు. BSNL STV 118 Planతో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 0.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 26రోజులుగా ఉంటుంది. BSNL STV 147 Planపై 30 రోజుల వ్యాలిడిటీ, 10జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తుంది. BSNL STV 185 ప్లాన్‌తో రోజుకు 1జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. BSNL STV రూ.187‌తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ కూడా 28రోజులుగా ఉంటుంది.

One Plus Smart TV: టీవీ కొనాలనేవారికి బంపర్ ఆఫర్.. రూ.572 చెల్లించండి స్మార్ట్‌టీవీ ఇంటికి తీసుకెళ్లండి..

Interest Rate: అధిక వడ్డీ పొందాలంటే ఈ 4 బ్యాంకులు సూపర్.. అవేంటంటే..?

Crime News: పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. కాలేజీ విద్యార్థినితో ప్రేమాయణం.. చివరకు ఏమైందంటే..?