Viral Video: పాము, చిరుతల మధ్య భీకర పోరు.. ఒళ్లు గగురు పొడిచే వీడియోపై ఓ లుక్కేయండి..
Viral Video: సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత నెట్టింట రోజుకో వీడియో వైరల్‌గా మారుతుంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట చేసే సందడి అంతా ఇంత కాదు. ఇలా అప్‌లోడ్ అవుతున్నాయో లేదో అలా..
Viral Video: సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత నెట్టింట రోజుకో వీడియో వైరల్‌గా మారుతుంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట చేసే సందడి అంతా ఇంత కాదు. ఇలా అప్‌లోడ్ అవుతున్నాయో లేదో అలా వైరల్‌గా మారుతున్నాయి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీపై పెరుగుతోన్న ఆసక్తి, అడ్వంచర్ కోరుకుంటున్న యువత కారణంగా ఇలాంటి వీడియోలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హంగామా చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఓ వాగులో చిరుత ఆహారం కోసం సంచరిస్తోంది. అదే సమయంలో అటుగా ఓ చిన్న పైథాన్ వచ్చింది. చిరుతపై దాడి చేయడానికి ప్రయత్నించిందో ఏమో కాని ఒక్కసారిగా అలర్ట్ అయిన చిరుత ఫైథాన్‌ను నోట కరిచింది. దీంతో పైథాన్ చిరుతను చుట్టేయడానికి ప్రయత్నించింది. అయితే చిరుత పంజా ముందు పైథాన్ పప్పులు మాత్రం ఉడకలేవు.
అలాగే నోట కరుచుకొని దగ్గరల్లో ఉన్న గట్టుపైకి ఎక్కి చెట్లలోకి వెళ్లిపోయింది. దీనంతటినీ అక్కడే ఉన్న ఓ ఫొటోగ్రాఫర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఓసారి చూసేయండి మరి..
View this post on Instagram
Also Read: Samantha Yashoda: సమంత సినిమా కోసం భారీ సెట్.. ఎంత ఖర్చు చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
East Godavari: బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్.. కొడుకుతో సహా దంపతుల దుర్మరణం..