AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Helicopter: కారుతో హెలికాఫ్టర్‌.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన బీహార్‌ యువకుడు.. వీడియో..

NANO Car Helicopter: ఇండియన్‌ యూత్‌ వెరీ టాలెంటెడ్‌. ఎంతో మంది ప్రముఖులు ఈ మాట చెప్పారు కూడా. తాజాగా మరోసారి తన తెలివితేటలతో ప్రపంచాన్నే

Car Helicopter: కారుతో హెలికాఫ్టర్‌.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన బీహార్‌ యువకుడు.. వీడియో..
Nano Car Helicopter
Shaik Madar Saheb
|

Updated on: Feb 21, 2022 | 9:58 AM

Share

NANO Car Helicopter: ఇండియన్‌ యూత్‌ వెరీ టాలెంటెడ్‌. ఎంతో మంది ప్రముఖులు ఈ మాట చెప్పారు కూడా. తాజాగా మరోసారి తన తెలివితేటలతో ప్రపంచాన్నే తమ వైపు తిప్పుకునేలా చేశాడు ఓ భారతీయుడు. సాధారణంగా హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవాలంటే కనీసం 2 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. దానికి పెద్ద మైదానం, అనుమతులు, అబ్బో ఆ హడావుడి అంతా ఇంతా కాదు. దాన్ని నేలకు దించాలంటే సమస్యలు ఎన్నో. మరి అదే హెలికాప్టర్ (helicopter) రోడ్డుపై నడిస్తే, హెలికాప్టర్ సాధారణ కార్లలాగే రయ్ రయ్‌ అంటూ రోడ్డుపై దూసుకెళ్తూ ఉంటే, వినడానికి కాస్త వింతగా ఉంది కదా. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు బీహార్‌కు చెందిన ఓ యువకుడు. హెలికాప్టర్‌ లాంటి కారు (Car) తయారు చేసి సోషల్ మీడియా (Social Media) లో ట్రెండీగా నిలిచాడు ఇండియన్‌ హీరో. తాను తయారు చేసిన ఆ హెలికాప్టర్ కారును వివాహ వేడుకలకు అద్దెకిస్తూ, ఉపాధి పొందుతున్నాడు.

ఉత్తర భారతదేశంలో చాలా మంది ధనికులు వివాహ వేడుకలలో హెలికాఫ్టర్‌ను ఉపయోగించడం క్రేజీగా మారిపోయింది. అయితే హెలికాఫ్టర్ అద్దెకు తెచ్చుకోవడం సంపన్నులకు మాత్రమే సాధ్యమయ్యే అంశం. దీంతో మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకున్న శర్మ, తన నానో కారును హెలికాప్టర్‌గా మార్చి వివాహ వేడుకలకు అద్దెకు ఇస్తూ, కామన్‌ పీపుల్ హెలికాప్టర్‌ కలను నెరవేరుస్తున్నాడు. తక్కువ ధరకే హెలికాఫ్టర్​ దొరుకుతుండడంతో అతడికి ఆర్డర్లూ పెరుగుతున్నాయి. తన నానో కారును హెలికాఫ్టర్‌గా మార్చడానికి శర్మకు అయిన ఖర్చు 2 లక్షలు మాత్రమే. కొన్ని సెన్సార్లను ఉపయోగించి ఇలా తన కారును హెలికాఫ్టర్ స్టైల్లోకి మార్చాడు.

నానో కారుకు రోటర్ బ్లేడ్, టెయిల్ బూమ్‌తో పాటు, రోటర్ మాస్ట్ చేర్చి హెలికాప్టర్ లుక్‌‌లో కనిపించేలా చేశాడు శర్మ. గతంలో బీహార్‌లోని ఛప్రా గ్రామానికి చెందిన మిథిలేష్ ప్రసాద్ అనే వ్యక్తి కూడా, పైలట్ కావాలని కలలు కన్నాడు. కానీ కాలేకపోయాడు. దీంతో తన నానో కారును హెలికాప్టర్‌గా మార్చుకొని, తన కలను నెరవేర్చుకున్నాడు. ఇదంతా చూసి నెటిజన్లు.. డిజిటల్‌ యుగంలో దేశానికి కావాల్సింది ఇలాంటి ఆవిష్కర్తలేనంటూ ప్రశంసిస్తున్నారు.

వీడియో.. 

View this post on Instagram

A post shared by UNILAD Tech (@uniladtech)

Also Read:

Viral Video: ఫర్హాన్ అక్తర్ పెళ్లిలో హృతిక్ రోషన్ డ్యాన్స్‌.. వైరల్‌ అవుతున్న వీడియో..

Karnataka Crime: కర్ణాటకలో నడిరోడ్డుపై దారుణం.. బజరంగ్ దళ్ కార్యకర్తను హతమార్చిన దుండగులు