Chanakya Niti: మనిషి జీవితంలో ఈ 5 పాఠాలు తెలుసుకుంటే.. ఎప్పటికీ మోసపోరంటున్న చాణక్య..

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya)రాజకీయ వేత్త, తెలివైన వ్యక్తి. తన జీవితంలో ఎదురైన అనుభవాలను నీతి శాస్త్రం(Niti Sastra)గా రచించాడు. ఈ నీటి శాస్త్రం నేటికీ అనుసరణీయం..

Chanakya Niti: మనిషి జీవితంలో ఈ 5 పాఠాలు తెలుసుకుంటే.. ఎప్పటికీ మోసపోరంటున్న చాణక్య..
Chanakya
Follow us
Surya Kala

|

Updated on: Feb 20, 2022 | 4:20 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు (Acharya Chanakya)రాజకీయ వేత్త, తెలివైన వ్యక్తి. తన జీవితంలో ఎదురైన అనుభవాలను నీతి శాస్త్రం(Niti Sastra)గా రచించాడు. ఈ నీటి శాస్త్రం నేటికీ అనుసరణీయం. ఇందులో మనిషి తన జీవితాన్ని సంతోషంగా, విజయవంతం జీవించడానికి అనేక ఉపయోగకరమైన సూచనలు ఉన్నాయి. ఈ  చాణక్య నీతిని బాగా చదివి, అనుసరించినట్లయితే, ఎవరికైనా విజయం తధ్యమని పెద్దల నమ్మకం. అయితే ఓ వ్యక్తి కొంతమందితో ఎప్పుడూ కలిసి జీవించ కూడదు అని అంటున్నాడు చాణక్య..

  1. చెడునడవడిక కల్గిన భార్య, నమ్మక ద్రోహం చేసే స్నేహితులు, అల్లరి సేవకుడు, పాముతో కలిసి జీవించే వ్యక్తి తన కష్టాలను  తానే ఆహ్వానిస్తున్నట్లు లెక్క అని అంటున్నాడు. ఒకొక్కసారి వీరు ప్రాణాంతకంగా మారి.. మరణానికి కూడా కారణం కావచ్చు.. కనుక వీరికి దూరంగా ఉండేవాడు తెలివైన వ్యక్తి అని అంటున్నాడు చాణక్య.
  2. చాణక్య నీతి ప్రకారం. ప్రతి వ్యక్తి తన జీవితంలో సంపదను కూడబెట్టుకోవాలి. ఎందుకంటే ఇబ్బంది ఎప్పుడైనా రావచ్చు. కష్టకాలంలో, ఎవరూ మీతో లేనప్పుడు, మీ డబ్బు మాత్రమే మీకు ఉపయోగపడుతుంది.
  3. సేవకుడు తన పనిని సరిగ్గా చేయనప్పుడు.. అతన్ని పరీక్షించాలి అని చాణక్య నీతి చెబుతుంది. ఇబ్బంది వచ్చినప్పుడు, బంధువును పరీక్షించాలి.  మీరు కష్టాల్లో ఉన్నప్పుడు.. మీ స్నేహితులు, మీకు మంచి సమయం లేనప్పుడు మీ భార్యను పరీక్షించాలని సూచించాలి.
  4. ఉపాధి మార్గాలు లేని చోట  ప్రజలు దేనికీ సిగ్గుపడకూడదు.  జ్ఞానం ఉన్నవారు లేని చోట, దానధర్మాలు, మతం పట్ల మక్కువ లేని వ్యక్తులు ఉన్న ప్రదేశంలో నివసించకూడదని చాణక్య చెప్పాడు.
  5. మీరు మూర్ఖుడికి బోధించడం, చేడు ఆలోచనలు కలిగిన భార్య ను పోషించినా,  ఎప్పుడూ విచారంగా ఉంటూ.. సంతోషంగా ఉండని వ్యక్తులతో సహవాసం చేసినా వారు ఇబ్బందుల్లో పడతారు. ఎప్పుడూ ప్రతికూలతను ఎదుర్కొంటారు. కనుక వీరికి దూరంగా ఉండడం మంచి తెలివైన పని.

Also Read :

రావులపాలెం చేరుకున్న జనసేనాని.. అడుగడుగునా జనసంద్రం.. ఓ రైతు అరటిగెల గిఫ్ట్..

శీతాకాలంలో వేధించే ఈ ఆరోగ్య సమస్యలకి నెయ్యితో చికిత్స.. అవేంటంటే..?