India Fishermen: బుద్ధి మార్చుకోని పాక్.. 30 మంది భారత జాలర్లను బంధీలుగా చేసుకున్న దాయాది..
పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ప్రపంచ దేశాలు దుమ్మెత్తి పోస్తున్నా తన కుటిల నీతిని ప్రదర్శిస్తూనే ఉంది
పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ప్రపంచ దేశాలు దుమ్మెత్తి పోస్తున్నా తన కుటిల నీతిని ప్రదర్శిస్తూనే ఉంది. తాజాగా అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 30మంది భారతీయ మత్స్యకారులను పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. అలాగే ఐదు పడవలను పాకిస్తాన్ సముద్ర తీర గస్తీ దళాలు సీజ్ చేశాయి. బంధీలుగా ఉన్నవారంతా గుజరాత్ (Gujarat) లోని పోరుబందర్ తీరం నుంచి ఐదు పడవల్లో వీరు బయల్దేరినట్లు అధికారులు చెబుతున్నారు. పాక్ సీజ్ చేసిన పడవల్లో రెండు మంగ్రోల్(గిర్ సోమనాథ్)కు చెందినవి కాగా.. ఓఖా, వానకబ్రా, పోర్బందర్కు చెందిన పడవలు ఒక్కొక్కటి ఉన్నాయని అధికారులు తెలిపారు.
పాక్ చెరలో 500మందికి పైగా జాలర్లు..
కాగా గత 25 రోజుల వ్యవధిలో 20 పడవలు, 120 మంది భారత మత్స్యకారులను దాయాది దేశం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో భారత జాలర్ల కుటుంబీకులు తెగ ఆందోళనకు గురవుతున్నారు. కాగా, ఈ విషయాన్ని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ మత్స్యకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు పాకిస్తాన్ చెరలో మొత్తం 1200 పడవలు, 500 మందికి పైగా జాలర్లు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు జనవరి 31న భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాక్ పడవలను బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నాయి. మొత్తం మూడు బోట్లు, ఓ పాకిస్తానీ పౌరుడిని అదుపులోకి తీసుకున్నాయి. కొందరు భద్రతా బలగాలను గమనించి ముందుగానే జారుకున్నారని సమాచారం. అయితే బీఎస్‌ఎఫ్ సీజ్ చేసిన బోట్లలో ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదు.
Also Read:Hyderabad: నగరవాసులకు అలెర్ట్.. ఆ రెండు రోజుల్లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం..
Constable Suicide: హైదరాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణమేంటంటే..