Constable Suicide: హైదరాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణమేంటంటే..
హైదరాబాద్ నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెరువు తండాలో నివాసముంటోన్న తేజావత్ రాజు (30) అనే వ్యక్తి శనివారం రాత్రి ఎవరూ ఇంట్లో లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి (Suicide) పాల్పడ్డాడు.
హైదరాబాద్ నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెరువు తండాలో నివాసముంటోన్న తేజావత్ రాజు (30) అనే వ్యక్తి శనివారం రాత్రి ఎవరూ ఇంట్లో లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి (Suicide) పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం రాజు తన గదిలో విగతజీవిగా పడిఉండటంతో గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజు మృత దేహన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ప్రేమ వ్యవహారమే!
తేజావత్ రాజు మహేశ్వరం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వరిస్తున్నారు. అతనికి తన బంధువుల అమ్మాయితో గత కొద్ది రోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పెళ్లి కూడా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత వేరే ఇంటికి మారాలని ఆ యువతి రాజుపై ఒత్తిడి తెచ్చింది. రాజుమాత్రం తల్లిదండ్రులను వదిలి వేరే ఇంటికి రానన్నాడు. వేరే ఇంటికి మారకుంటే పెళ్లి చేసుకోనని యువతి రాజుకు తేల్చిచెప్పింది. ఈవిషయంలో రాజు యువతిని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో రాజు మనస్తాపానికి గురయ్యాడు. డిప్రెషన్‌లోకి జారి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. రాజు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.