CM KCR: జీవన వైవిద్యానికి బోనాలు ప్రతీక.. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

CM KCR-Bonalu: రాష్ట్రపండుగైన బోనాల పండగ ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పణతో గురువారం నుంచి తెలంగాణలో బోనాల ఉత్సవాలు..

CM KCR: జీవన వైవిద్యానికి బోనాలు ప్రతీక.. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
Telangana CM KCR
Sanjay Kasula

| Edited By: Anil kumar poka

Jul 09, 2022 | 5:43 PM

తెలంగాణ ప్రత్యేకతను చాటే బోనాల పండుగ తెలంగాణ జీవన వైవిద్యానికి, పర్యావరణ,ప్రకృతి ఆరాధనకు ప్రతీకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు(CM KCR) అన్నారు. రాష్ట్రపండుగైన బోనాల పండగ ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పణతో గురువారం నుంచి తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ మాసాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు.  తెలంగాణ సబ్బండ వర్గాల సాంప్రదాయాలకు, రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవాన్నిస్తున్నదని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు అందించాలని అమ్మవారిని సీఎం కేసీఆర్ ప్రార్ధించారు.

తెలంగాణ సంస్కృతి..

తెలంగాణ అంటే తమైదన ప్రత్యేక సంస్కృతి. తెలంగాణలో బోనాలు అంటే తెలంగాణకే పరిమితిమై, మదిమదిలో పులకరించే ఓ సంబురం. ఆడబిడ్డలను సాదరంగా ఆహ్వానించే పండుగ. గలగల గాజుల గానం. పల్లెపాటకు శివాలెత్తి ఆడే పట్టణ స్త్రీల అంతరంగ రాగం. పట్టుచీరలు, అలంకరణలు, వేపాకులు… తలపైన అమ్మవారికి భక్తితో అర్పించే బోనాలు.

శతాబ్దాల చరితగల తెలంగాణలో బోనాల జాతర షురువయ్యింది. తెలంగాణ సంస్కృతికీ, తెలంగాణ సాంప్రదాయాలకీ ప్రతిబింబమైన బోనాల పండుగను తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు ప్రజలు ఉర్రూతలూగుతున్నారు. గజ్జెకట్టి ఆడేందుకు పోతురాజులు తహతహలాట.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu