AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS: టీఆర్ఎస్ భారీ స్కెచ్.. ప్రధాని మోదీ వచ్చే రోజే హైదరాబాద్‌కు యశ్వంత్‌ సిన్హా రాక..

Yashwant Sinha: ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. ఇంకోవైపు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్‌కు రాబోతున్నారు. జులై 2న టీఆర్‌ఎస్‌తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు యశ్వంత్ సిన్హా.

TRS: టీఆర్ఎస్ భారీ స్కెచ్.. ప్రధాని మోదీ వచ్చే రోజే హైదరాబాద్‌కు యశ్వంత్‌ సిన్హా రాక..
Yashwant Sinha
Sanjay Kasula
|

Updated on: Jun 30, 2022 | 10:18 PM

Share

జాతీయ రాజకీయాలు తెలంగాణ చుట్టూ తిరుగుతున్నాయి. ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.. ఇంకోవైపు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్‌కు రాబోతున్నారు. జులై 2న టీఆర్‌ఎస్‌తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు యశ్వంత్ సిన్హా. జలవిహార్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం కానున్నారు. మొత్తానికి పోటాపోటీ సమావేశాలతో తెలంగాణ గట్టుమీద రాజకీయం వేడెక్కబోతుంది. జూలై 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరగనున్నాయి. ప్రధాని మోదీతో సహా బీజేపీ అధినాయకత్వం మొత్తం తరలి వస్తోంది. కీలక తీర్మానాలు.. రాజకీయ నిర్ణయాలకు ఈ సమావేశాలు వేదిక కానుంది.

హైదరాబాద్ వేదికగా..

సుదీర్ఘ విరామం తరువాత హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రంగం సిద్ధమైంది. దీనికి కొనసాగింపుగా 3వ తేదీ బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. విజయ సంకల్ప యాత్ర పేరుతో నిర్వహించే ఈ సభలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ సభను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. లక్షలాది మందిని తరలించే ప్రయత్నం చేస్తోంది. సరిగ్గా అదే సమయంలోనే జాతీయ విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వస్తున్నారు. జూలై 2వ తేదీన ఆయన హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం.

టీఆర్ఎస్ భారీ ర్యాలీ..

10 వేల బైక్‌ల‌తో భారీ ర్యాలీగా బేగంపేట, రాజ్‌భ‌వ‌న్‌రోడ్‌, నెక్లెస్ రోడ్ మీదుగా జలవిహార్ చేరుకోనేలా ప్లాన్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆయన తెలంగాణలో తనకు మద్దతుగా నిలుస్తున్న టీఆర్ఎస్ – కాంగ్రెస్ ఓటర్లతో సమావేశం కానున్నారు. ముఖ్యంత్రి కేసీఆర్ తోనే భేటీ అవుతారని తెలుస్తోంది. అటు బీజేపీ సమావేశాలు జరగుతున్న సమయంలో వ్యూహాత్మకంగా ఈ ప్రోగ్రాంను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ తో పాటుగా మద్దతు ఇస్తున్నా.. కూటమితో తమకు సంబంధం లేదని ఇప్పటికే మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఎన్డీఏ అభ్యర్ధి ముర్ముకు మద్దతుగా నిలవనున్నారు. టీఆర్ఎస్ కు చెందిన ఎంపీలు – ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశం అయి..మద్దతు కోరునున్నారు.

తెలంగాణ వార్తల కోసం