CM KCR: ప్రజాసౌధంలో తొలి సమీక్ష.. నూత‌న స‌చివాల‌యంలో అధికారులతో భేటీ కానున్న సీఎం కేసీఆర్

తెలంగాణ అస్తిత్వ వైభవానికి ప్రతీకగా.. అమెరికా వైట్ హస్ ను తలపించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.

CM KCR: ప్రజాసౌధంలో తొలి సమీక్ష.. నూత‌న స‌చివాల‌యంలో అధికారులతో భేటీ కానున్న సీఎం కేసీఆర్
CM KCR
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 01, 2023 | 8:15 AM

తెలంగాణ అస్తిత్వ వైభవానికి ప్రతీకగా.. అమెరికా వైట్ హస్ ను తలపించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్‌.. తన ఛాంబర్ లో ఆసీనులై.. ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆ తర్వాత మంత్రులు, అధికారులు ఒకేసారి తమ తమ ఛాంబర్ లలో ఆసీనులయ్యారు. 28 ఎకరాల్లోని విశాల స్థలంలోని 7,79,982 చదరపు అడుగులు విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో ఈ భవనాన్ని నిర్మించారు.

కాగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో ముక్యమంత్రి కేసీఆర్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం తొలి స‌మీక్ష నిర్వహించనున్నారు. పాల‌మూరు – రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌నులు, క‌రివేన‌, ఉదండాపూర్ కాల్వల విస్తరణ ప‌నులతో పాటు ఉదండాపూర్ నుంచి తాగునీరు త‌ర‌లింపు, తదితర ప‌నుల‌పై సీఎం కేసీఆర్ అధికారులతో స‌మీక్షించ‌నున్నారు. కొడంగ‌ల్, వికారాబాద్ వెళ్లే కాల్వ పనులు, అలాగే రాష్ట్రంలో ప్రారంభించిన కొత్త ప్రాజెక్టులు, వాటి ప‌నుల‌పై కూడా కేసీఆర్ స‌మీక్ష చేయ‌నున్నారు. ఈ స‌మావేశానికి సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు హాజ‌రు కానున్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వర్షాలు, పంట నష్టం తదితర విషయాలపై కూడా అధికారులతో చర్చించనున్నారు. కాగా, అకాల వర్షాల కారణంతో పలు ప్రాంతాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!