AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: అదే జోరు.. అదే స్పీడు.. రెట్టింపు ఉత్సాహంతో గులాబీ బాస్ స్పీచ్‌లు

జుక్కల్‌, బాన్స్‌వాడ..నారాయణ్‌ ఖేడ్‌ మూడు సభలు కార్యకర్తలతో హోరుతో దద్దరిల్లాయి. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కొందరు హింసకు తెరలేపుతున్నారని ఆరోపించారు కేసీఆర్‌. దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎంపీ కొత్తా ప్రభాకర్‌ రెడ్డిపై దాడి ఓ పిరికి చర్య అన్నారు కేసీఆర్‌. ఈ ఘటనను యావత్‌ తెలంగాణ సమాజం ఖండించాలన్నారు.

CM KCR: అదే జోరు.. అదే స్పీడు.. రెట్టింపు ఉత్సాహంతో గులాబీ బాస్ స్పీచ్‌లు
CM KCR
Ram Naramaneni
|

Updated on: Oct 30, 2023 | 7:13 PM

Share

హ్యాట్రిక్‌ టార్గెట్‌గా ప్రచారపర్వంలో కారు టాప్‌గేరులో దూసుకెళ్లోంది. దసర తరువాత జోష్‌ మరింత పెరిగింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలే అస్త్రాలుగా బీఆర్‌ఎస్‌ గెలుపు దరువేస్తోంది. రెండో విడత ప్రచారంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరింత జోరు పెంచారు. ఆదివారం కోదాడ. తుంగతుర్తి, ఆలేరు….గులాబీమయం కాగా.. సోమవారం జుక్కల్‌..బాన్స్‌వాడ.. నారాయణ ఖేడ్‌ లో బీఆర్‌ఎస్‌ ధూమ్‌ దామ్‌‌గా ప్రచార హోరు నడిపింది బీఆర్‌ఎస్. వాళ్లు వచ్చి.. వీళ్లు వచ్చి ఓట్లు అడిగితే అని ఆగం ఆగం కావొద్దు.. ఇవాళ ప్రతి ఇంటికి నీళ్లు ఎలా వచ్చినయ్‌.. కోతల్లేని కరెంట్ ఎవరి వల్ల… ఎందువల్ల ఇవాళ బంగారు తెలంగాణ..,, బుద్ధికి పనిపెట్టి ఓటేయాలంటూ హుషారెత్తారించారు సీఎం కేసీఆర్‌. గ్యారెంటీలు ఇస్తుండ్రని గాయ్‌ గాయ్‌ కావొద్దని కాంగ్రెస్‌ టార్గెట్‌గా మరోసారి పవర్‌ అస్త్ర ప్రయోగించారు కేసీఆర్‌. హామీలు ఫుల్‌..అమలు నిల్లు. కాంగ్రెస్‌ ఓటేస్తే కత కర్నాటకలా ఉంటదన్నారు.

మహారాష్ర్ట పర్యటనలో అక్కడి రైతుల దైన్యం చూస్తే దు:ఖం కట్టలు తెగిందన్నారు కేసీఆర్‌. ఎప్పటి నుంచో పెద్ద రాష్ర్టంగా వున్న మహారాష్ట్ర ఎట్లుంది. తెలంగాణ ఎట్లుందని కళ్లకు కట్టారు కేసీఆర్‌. ఆదాయం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో సంక్షేమం లేదన్నారు. రైతు బంధు… ఈ పథకం గురించి ఎవరైనా ఆలోచించారా? రైతు బంధును సృష్టించిందే తానన్నారు కేసీఆర్‌. రైతు బంధుపై కొందరు కిరికిరి చేస్తున్నారని విమర్శించారు. బరాబార్‌ రైతు బంధు కొనసాగుతుందన్నారు కేసీఆర్‌. ధరణిపై కొందరు విషం కక్కుతున్నారన్నారు కేసీఆర్‌. ధరణి లేకపోతే మళ్లీ భూముల వ్యవహారం దళారుల చేతికి వెళ్తుందన్నారు.

చుక్క నెత్తురు నేలరాలకుండా తెలంగాణ తెచ్చుకున్నాం. స్వపరిపాలనలో చక్కగా అభివృధ్ది, సంక్షేమం పెంచుకుంటున్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కొందరు హింసకు తెరలేపుతున్నారని ఆరోపించారు కేసీఆర్‌. దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎంపీ కొత్తా ప్రభాకర్‌ రెడ్డిపై దాడి ఓ పిరికి చర్య అన్నారు కేసీఆర్‌. ఈ ఘటనను యావత్‌ తెలంగాణ సమాజం ఖండించాలన్నారు. జుక్కల్‌, బాన్స్‌వాడ..నారాయణ్‌ ఖేడ్‌ మూడు సభలు కార్యకర్తలతో హోరుతో దద్దరిల్లాయి. తెలంగాణ ..రంగు రుచి వాసన లేని స్వచ్చమైన నీటిలాందిన్నారు కేసీఆర్‌. భాయ్‌-భాయ్‌ సంస్కృతికి తెలంగాణ వేదిక అన్నారు.కానీ కొందరు ఈ సహృదత్వాన్ని విచ్ఛినం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తన కంఠంలో ప్రాణం వున్నంత వరకు అలాంటి ఆటలు సాగినవ్వనన్నారు కేసీఆర్‌.

మూడు సభలు..ఆరు సిక్సర్ల లెక్క ప్రజాశీర్వాద సభలతో బీఆర్‌ఎస్‌ జోష్‌గా దూసుకెళ్తోంది. ప్రతి సభలో పవర్‌ అస్త్ర ప్రయోగిస్తున్నారు గులాబీ దళపతి కేసీఆర్‌. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను బారీ మెజార్జీతో గెలిపించాలని పిలుపునిచ్చారాయన. బీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి- సంక్షమం సాధ్యమన్నారు కేసీఆర్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..