Telangana: బీజేపీలో జనసేనతో పొత్తు చిచ్చు – వాట్ నెక్స్ట్
జనసేన పొత్తు అంశం బీజేపీలో కలకలం రేపుతోంది. పొత్తులో భాగంగా తమ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని బీజేపీ అభ్యర్థులు చెబుతున్నారు. కూకట్‌పల్లి సీటు జనసేనకు కేటాయించవద్దని బీజేపీ కార్యకర్తలు ఆందోళన దిగారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కూకట్‌పల్లి కార్యకర్తల నిరసన వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఎన్నికల రాజకీయం మారుతోంది. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. బీజేపీ – జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. కానీ, సీట్ల పైన చర్చలు మాత్ర ఖరారు కాలేదు. జనసేన అడుగుతున్న సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్దంగా లేదు. జనసేన పట్టు పడుతున్న సీట్లు ఇచ్చేందుకు బీజేపీ నేతలు అంగీకరించటం లేదు. దీంతో, జనసేనతో పొత్తు వ్యవహారం కొత్త చిచ్చుకు కారణమవుతోంది.
ఇక జనసేన పొత్తు అంశం బీజేపీలో కలకలం రేపుతోంది. పొత్తులో భాగంగా తమ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని బీజేపీ అభ్యర్థులు చెబుతున్నారు. కూకట్‌పల్లి సీటు జనసేనకు కేటాయించవద్దని బీజేపీ కార్యకర్తలు ఆందోళన దిగారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కూకట్‌పల్లి కార్యకర్తల నిరసన వ్యక్తం చేశారు. కూకట్ పల్లి గడ్డ .. బిజెపి అడ్డా అంటూ నినాదాలు చేశారు. జనసేనతో పొత్తు వద్దే వద్దని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి కార్యకర్తలు భీష్మించారు.
జనసేన తెలంగాణలో 32 స్థానాలకు పోటీ చేయాలని తొలుత నిర్ణయించింది. దీంతో బీజేపీ రాష్ట్ర నేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ మద్దతు కోసం నేరుగా జనసేనాని పవన్ తో చర్చలు చేసారు. బీజేపీ అధినాయకత్వంతో చర్చల తరువాత నిర్ణయం తీసుకుందామని పవన్ ప్రతిపాదించారు. ఢిల్లీలో పవన్ నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటంతో బీజేపీ – జనసేన కలిసి ఎన్నికల్లో పని చేయాలని అమిత్ షా నిర్దేశించారు. సీట్ల గురించి కలిసి నిర్ణయానికి రావాలని సూచించారు. కానీ, ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు.
మరోవైపు టికెట్ల కేటాయింపు చిచ్చు….
క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే బీజేపీలోనూ టికెట్ల కేటాయింపు చిచ్చు రేపింది. నర్సాపూర్ టికెట్‌ను ఈ మధ్యే BRS నుంచి బీజేపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్‌కు కేటాయించింది. టికెట్ ఆశించిన గోపి ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అనుచరులతో కలిసి వచ్చి హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ధర్నాకు దిగారు. భూకబ్జాదారులకు టికెట్ ఇస్తారా అని నినాదాలు చేశారు. క్యారెక్టర్ లేని వ్యక్తికి టికెట్ కేటాయించారని గోపి ఆరోపించారు. 27 ఏళ్లుగా తాను పార్టీ కోసం కష్టపడుతున్నానని తెలిపారు.
మరో వైపు పొత్తు పేరు చెప్పి కూకట్‌పల్లి స్థానాన్ని జనసేనకు కేటాయించవద్దని డిమాండ్ చేస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలు బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిరసనకు దిగారు. కూకట్‌పల్లి గడ్డ- బీజేపీ అడ్డా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కార్యాలయంలో కూర్చొని నిరసనకు దిగారు. కూకట్‌పల్లిలో అధికార BRSకు గట్టి పోటీ ఇవ్వగల సత్తా BJPకి మాత్రమే ఉందని ఆ నియోజకవర్గం నేతలంటున్నారు. GHMC ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ రెండో స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. బీజేపీ అభ్యర్థిని బరిలోకి దింపితే తాము కచ్చితంగా గెలిపిస్తామని పార్టీ నేతలకు తెలిపారు. తెలంగాణలో పోటీకి ఆసక్తి చూపుతున్న జనసేన – GHMC పరిధిలో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి స్థానాలు కోరుతోంది.
మొత్తానికి ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీల్లో టికెట్ టెన్షన్ కనిపిస్తోంది. టికెట్‌పై గంపెడాశాలు పెట్టుకున్న నేతలు తమ ఆశలు అడియాసలు కావడంతో పార్టీ నాయకత్వాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
