Hyderabad: ట్రిపుల్ తలాఖ్ చట్టానికి తూట్లు.. పాత బస్తీలో పెరుగుతున్న మహిళల కన్నీటి వెతలు

Hyderabad: ట్రిపుల్ తలాఖ్ చట్టానికి తూట్లు.. పాత బస్తీలో పెరుగుతున్న మహిళల కన్నీటి వెతలు
Triple Talaq Cases

Triple Talaq Cases In Hyderabad: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 ట్రిపుల్ తలాఖ్ కేసులు.. అదేంటి 2019 నుంచి ట్రిపుల్ తలాఖ్ చట్టం అమల్లో ఉందిగా.. ఇదెలా సాధ్యమైందీ? అనే ప్రశ్న ఏర్పడవచ్చు.. కానీ ఈ చట్టాన్ని ఏదో ఒక రకంగా వాడుతూ..

Sanjay Kasula

|

Aug 19, 2021 | 1:08 PM

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 ట్రిపుల్ తలాఖ్ కేసులు.. అదేంటి 2019 నుంచి ట్రిపుల్ తలాఖ్ చట్టం అమల్లో ఉందిగా.. ఇదెలా సాధ్యమైందీ? అనే ప్రశ్న ఏర్పడవచ్చు.. కానీ ఈ చట్టాన్ని ఏదో ఒక రకంగా వాడుతూ ముస్లిం భర్తలు చెలరేగిపోవడం ఇపుడు సంచలనంగా మారింది. మహానగరం హైదరాబాద్‌లోనే ఇలా ఉందంటే.. ఇక మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ట్రిపుల్ తలాఖ్ కేసుల సంఖ్య పెరగడంపై తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.  విబేధాలు తలెత్తిన భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా.. వారి కాపురాలను సరి చేయవచ్చు. వీలైనంత వరకూ తలాఖ్ ను తగ్గించి ఇరువురినీ కలపడం మంచిదని అంటున్నారు వక్ఫ్ బోర్డ్ పెద్దలు.

2019 నాటి నుంచి నగరంలో మూడు కమీషనరేట్ల పరిధిలో దాదాపు 50 త్రిపుల్ తలాఖ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 40 వరకూ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే.. జరిగినట్టు తెలుస్తోంది. ఇది చాలా చాలా బాధాకరంగా చెబుతున్నారు మతపెద్దలు.

Talaq Cases

Talaq Cases

ట్రిపుల్ తలాఖ్- లేదా తలాఖ్ ఉల్ బిద్దత్ పేరిట తలాఖ్ చెప్పే విధానంపై అనేక అభ్యంతరాలున్నాయి. నిజానికి తలాఖ్ చెప్పిన భర్త- భార్యకు భరణం చెల్లించాల్సి ఉంటుంది. కానీ, దీన్నొక నేరంగా పరిగణిస్తే.. ఆ భార్యకు భరణం దక్కదు. ఎందుకంటే భర్త జైల్లో ఉండగా.. ఆమే తన పిల్లలను పోషించాల్సి ఉంటుందని అంటారు ఈ చట్టాన్ని విమర్శించేవారు.

ఎన్నో పోరాటాల తర్వాత సాధించుకున్న ట్రిపుల్ తలాఖ్ తిరిగి ఏదో ఒక రూపంలో అమల్లోకి రావడం కరెక్టు కాదు. ఈ చట్టం అమలు కాకపోవడంతో కాపురాలు కుప్పకూలిపోయే ప్రమాదముంది. ముస్లిం మహిళల భద్రతకు తీవ్ర విఘాతమేర్పడుతుందని అంటున్నారు కొందరు.

కాదు.. ట్రిపుల్ తలాఖ్ ఉండటమే కరెక్టన్నది మరికొందరి వాదన. ట్రిపుల్ తలాఖ్ లేకుంటే ఆ భార్యా భర్తలిద్దరూ కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని చెప్పుకుస్తున్నారు వీరు.. 20 కి పైగా దేశాల్లో ట్రిపుల్ తలాఖ్ పై నిషేధం ఉంది. వివిధ పద్ధతుల్లో నియంత్రిస్తున్న మరి కొన్ని దేశాలున్నాయి.

ఏది ఏమైనా ట్రిపుల్ తలాఖ్ ను చట్టంగా చేసింది కేంద్ర ప్రభుత్వం. తాత్కాలిక విడాకులు ఇవ్వడం.. భారత రాజ్యాంగం ప్రకారం తప్పు. ఇలా చేసిన ముస్లిం పురుషుడికి 3 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారని అంటున్నారు న్యాయనిపుణులు.

చట్టంలో ఏముంది…

ముస్లిం మహిళ వివాహ హక్కుల సంరక్షణ బిల్లు. 2017లో సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం అని తెలిపింది. 2018 లో ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ మోడీ ప్రభుత్వం బిల్లును తయారు చేసి లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు లోక్‌సభలో 2018 డిసెంబర్ 27వ తేదీన ఆమోదం తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం ముస్లిం మహిళకు ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పడం శిక్షార్హమైన నేరం. అలా చెబితే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది.

ముస్లిం దేశాలు నిషేదం…

ట్రిపుల్ తలాక్‌ను చాలా ముస్లిం దేశాలు నిషేధించాయి. ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరంగా పరిగణిస్తున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, సిప్రస్, ట్యునీషియా, మలేషియా, ఇరాన్, శ్రీలంక, జోర్డాన్,అల్జీరియా, ఇండోనేషియా, యూఏఈ, ఖతార్, సుడాన్, మొరొకో, ఈజిప్ట్, ఇరాక్, బ్రూనేలాంటి దేశాలు నిషేధించాయి. అన్ని దేశాల్లో చట్టం కఠినంగా అమలు జరుగుతోంది.

ఇవి కూడా చదవండి:  Success Story: మేడపై మల్లె పూల సాగు.. లక్షల్లో సంపాదన.. లాక్‌డౌన్ సమయంలో ఓ మహిళ విజయ గాథ..

Women Should be Careful: మీ పక్కనే మృగాళ్లుంటారు.. మహిళలు బీ కేర్ ఫుల్.. సో.. బీ అలర్ట్ లేడీస్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu