తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేపటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ

కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూతపడ్డ విషయం తెలిసిందే. అయితే అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా అన్ని రంగాలు కూడా ఒక్కొక్కటిగా ..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేపటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ
Follow us

|

Updated on: Feb 23, 2021 | 3:02 PM

కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూతపడ్డ విషయం తెలిసిందే. అయితే అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా అన్ని రంగాలు కూడా ఒక్కొక్కటిగా తెరుచుకుంటుండగా, తెలంగాణలో విద్యా సంస్థలు కూడా పై తరగతి విద్యార్థులకు మాత్రమే అనుమతిస్తూ తరగతులను ప్రారంభించారు. అయితే తాజాగా కేసీఆర్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి 6,7, 8 తరగతులు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ తరగతులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి మార్చి 1లోగా తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో కోవిడ్‌ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించారు. అయితే పాఠశాలలు తెరుచుకుంటుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

అలాగే పాఠశాల తరగతి గదుల్లో ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేస్తుండాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అధ్యాపకులు, విద్యార్థులు తప్పకుండా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు.

కాగా, గత ఏడాదిగా కరోనా మహహ్మారి వల్ల విద్యార్థుల చదువుపై తీవ్రమైన ప్రభావం చూపింది. అయితే విద్యార్థులు పూర్తిగా నష్టపోకుండా ఈ ఏడాది ఆన్‌లైన్‌ క్లాసులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పైగా ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల విద్యార్థుల పెద్దగా వచ్చిందేమి లేదు. రోజువారిగా తరగతులు చెప్పినట్లుగా ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. కొందరు విద్యార్థులు అయితే అయితే ఆన్‌లైన్‌ క్లాసులను కూడా అటెండ్‌ చేయలేదు. ఈ మధ్యనే 9,10, ఆపై తరగతుల వారికి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, వారికి మాత్రమే తరగతులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు 6,7,8 తరగతులను ప్రారంభించాలని కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. మరీ మిగత కింది తరగతులను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. విద్యార్థులు ఈ ఏడాది పూర్తిగా నష్టపోకుండా కొన్ని కొన్ని తరగతులను ప్రారంభం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ తరగతుల విద్యార్థులు కూడా పాఠశాలలకు రావాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసింది.

Also Read:

తెలంగాణలో మరోసారి కలవరపెడుతున్న కరోనా వైరస్.. కొత్తగా 114 మందికి కోవిడ్ పాజిటివ్

Onion Prices: మళ్లీ కోయకుండానే కన్నీళ్లు.. భారీగా పెరిగిన ఉల్లి ధర.. కిలోకు రూ. 60 నుంచి 70 రూపాయలు.. ఎక్కడంటే