Onion Prices: మళ్లీ కోయకుండానే కన్నీళ్లు.. భారీగా పెరిగిన ఉల్లి ధర.. కిలోకు రూ. 60 నుంచి 70 రూపాయలు.. ఎక్కడంటే
Onion Prices:ఒక వైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోతుంటే ఇప్పుడు ఉల్లి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకదాని వెనుక ఒకటి ధరలు పెరుగుదలతో సామాన్యుడి..
Onion Prices: ఒక వైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోతుంటే ఇప్పుడు ఉల్లి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకదాని వెనుక ఒకటి ధరలు పెరుగుదలతో సామాన్యుడి జీవితం ప్రశ్నర్థకంగా మారిపోతోంది. గతంలో కోయకుండానే కన్నీళ్లు పెట్టించిన ఉల్లి.. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి తెచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలోని ముంబైలో గత కొన్ని వారాలలో ఉల్లి ధర రెట్టింపు అయింది. ఈ ఏడాది మొదట్లో కిలో ఉల్లి ధర రూ.25-30 ఉండగా, ప్రస్తుతం కిలోకు రూ.60-70 విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యుడికి మరింత భారంగా మారింది. ఇలా ధరలు పెరిగిపోతుండటంతో ప్రజలు ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గత ఏడాది కురిసిన వర్షాల కారణంగా మహారాష్ట్రలో ఉల్లి పంట అధికంగా నాశనమైంది.
ఉత్పత్తి లేకపోవడం కారణంగా సరఫరా కూడా తగ్గిపోయంది. ఇప్పుడు దాని ప్రభావం ధరలపై కనిపిస్తోంది. గత కొన్ని వారాలలో ఉల్లి ధర రెండు రేట్లపైగా పెరిగింది. నవీ ముంబైలో ఏపీఎంసీ మార్కెట్లో గతంలో ఉల్లిపాయ కిలోకు రూ.30-40 హోల్ సేల్ ధరకు అమ్మేవారు. ముంబై, పూణే, థానే రిటైల్ మార్కెట్లలో ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.50 నుంచి 60 వరకు అమ్మడవుతోంది.
కాగా, దేశంలో అతిపెద్ద హోల్ సేల్ ఉల్లి మార్కెట్ అయిన లాసల్‌గావ్‌లో ఉల్లిపాయల టోకు రేటు గత 10 రోజుల్లో 15 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. రిలైల్‌లో ఉల్లిపాయ ధలోకు రూ.54 ఉంది. మరో వైపు పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటం కూడా ఒక ప్రధాన కారణం. ఎందుకంటే సరుకు రవాణా మరింత ఖరీదైనది. జనవరి 1న ఢిల్లీలో డీజిల్ ధర లీటరుకు రూ.73.87 ఉండగా, నేడు రూ.78.38కి చేరింది.