హత్యకేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కుల బహిష్కరణ.. తీవ్ర మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య..!

కుల బ‌హిష్కర‌ణ చేయ‌డంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన యువ‌కుడు నిన్న రాత్రి ఆత్మహ‌త్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌లో దారుణం జరిగింది.

  • Balaraju Goud
  • Publish Date - 1:41 pm, Tue, 23 February 21
హత్యకేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కుల బహిష్కరణ.. తీవ్ర మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య..!

Young Man Suicide : కుల బ‌హిష్కర‌ణ చేయ‌డంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన యువ‌కుడు నిన్న రాత్రి ఆత్మహ‌త్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్‌లో దారుణం జరిగింది. ఇప్ప శంకర్ అనే వ్యక్తిని కులపెద్దలు బహిష్కరించారు. ఆరేళ్లుగా ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఇప్ప శంకర్.. కేసు కొట్టివేయడంతో ఈ మధ్యే జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే హ‌త్య కేసులో శంక‌ర్ నిందితుడిగా ఉన్న స‌మ‌యంలోనే అత‌ని కుటుంబాన్ని కుల పెద్దలు కులం నుంచి బ‌హిష్కరించారు.

ఇదిలావుంటే, శంకర్‌కు కోర్టు అనుమతించిన గ్రామస్తుల మాత్రం అంక్షలు విధించారు. ఇదే క్రమంలోనే కులపెద్దలు అల్టిమేటం జారీ చేశారు. కులంలోకి రావాలంటే మూడు లక్షల నష్టపరిహారం చెల్లించాలని షరతు విధించారు. కండీషన్ పెట్టారు. పెద్దలు ఇచ్చిన తీర్పుతో శంకర్ షాకయ్యాడు. ఇదేం న్యాయమంటూ జ‌న‌వ‌రి 6వ తేదీన అల్లాదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కి ముందు తీసిన సెల్ఫీ వీడియోలో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో శంక‌ర్ నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.