ఏవోబీలో కూంబింగ్‌ దళాలకు తప్పిన పెను ప్రమాదం.. మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాల గుర్తింపు

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో కూంబింగ్ దళాలకు పెను ప్రమాదం తప్పింది. కుంబింగ్ దళాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్ధాలను..

ఏవోబీలో కూంబింగ్‌ దళాలకు తప్పిన పెను ప్రమాదం.. మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాల గుర్తింపు
Follow us
K Sammaiah

|

Updated on: Feb 23, 2021 | 3:48 PM

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో కూంబింగ్ దళాలకు పెను ప్రమాదం తప్పింది. కుంబింగ్ దళాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్ధాలను గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ బలగాలు.. 5 కిలోల బాంబును పేల్చివేశాయి. అంతేకాకుండా మరికొన్ని ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా లో గల మల్కన్ గిరి జిల్లా కదిలి బంధ అటవీ ప్రాంతంలో ఈఘటన చోటు చేసుకుంది.

ఏవోబీలో కొంత కాలంగా పోలీసులు- మావోయిస్టులకు మధ్య యుద్ధం సాగుతోంది. తరచూ ఏఓబీ సరిహద్దుల్లో కాల్పుల మోతతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఇదే ప్రాంతంలో మరోసారి బాంబుల కలకలం రేగింది. ఏఓబీ పరిధిలోని చిత్రకొండ స్వాబిమాన్ అటవీ ప్రాంతంలోని హంటల్‌గుడలో బిఎస్ఎఫ్ బలగాలు మావోయిస్టులకి చెందిన పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

నిఘా వర్గాల సమాచారం ప్రకారం బీఎస్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు నిర్వహించారు. చిత్రకొండ బ్లాక్ హంటల్ గూడ అటవీ ప్రాంతంలోని కదలిబంధ గ్రామానికి సమీపంలో ఉన్న కొండ వద్ద మావోయిస్టులు దాచి ఉంచిన బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బ్యాగ్ నుండి రెండు ప్రెషర్ మైన్స్, ఒక టిఫిన్ బాంబు మరియు ఇతర వస్తువులను బిఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్.. వాటిని పేల్చేసింది.

ఇటీవల ఇదే ప్రాంతంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఏజెన్సీ ప్రాంతంలో కూంబిం నిర్వహిస్తున్న భద్రతాబలగాలే లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు..ఓ ల్యాండ్ మైన్ తో ఎటాక్ చేశారు. ఈ ఘటనలో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే జవాన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ల్యాండ్ మైన్ పేల్చినప్పటి నుంచి పోలీసులు అప్రమత్తయ్యారు. ఏజెన్సీని జల్లెడపడుతున్నారు.