Hyderabad: పీకలదాకా తాగారు.. ఆపై బిల్లు కట్టమంటే ‘నై’ అన్నారు.. చివరికి ఏం జరిగిందంటే..

Hyderabad: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యం మత్తులో కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టుకున్నారు.

Hyderabad: పీకలదాకా తాగారు.. ఆపై బిల్లు కట్టమంటే ‘నై’ అన్నారు.. చివరికి ఏం జరిగిందంటే..
Drinking
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 14, 2021 | 10:32 AM

Hyderabad: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మద్యం మత్తులో కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టుకున్నారు. తాగిన మందుకు బిల్లు చెల్లించమంటే కుదరదంటూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరధిలో భవాని బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. అందులో మద్యం సేవించేందుకు ఓ గ్యాంగ్ వచ్చింది. పీకలదాకా మద్యం సేవించారు. ఆ తరువాత బిల్లు కట్టమంటూ సిబ్బంది సంబంధిత బిల్లును వారికి ఇచ్చారు. అయితే, తాము బిల్లు కట్టం అంటూ బార్ యజమానితో గొడవకు దిగారు గ్యాంగ్ సభ్యులు. ఈ క్రమంలో బార్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు.

ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ కాస్తా.. భౌతిక దాడుల వరకు వెళ్లింది. బార్ యాజమని, సిబ్బందిపై దుండగులు కర్రలతో దాడికి తెగబడ్డారు. తీవ్రంగా కొట్టిన అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో గాయపడిన వారిని 108 అంబులెన్స్ సాయంతో ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కాగా, విషయం తెలుసుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బార్ యాజమాన్యంపై దాడికి పాల్పడిన వారిని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను వెంటనే పట్టుకుంటామని తెలిపారు.

Also read:

India Corona: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!

Digital India Corporation: డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

World Sight Day: కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం..!