Rachakonda Police: సోషల్ మీడియాలో నెటిజన్లు ‘శభాష్ పోలీస్’ అంటూ పొగడ్తల వర్షం.. ఎందుకంటే..?
రోడ్లపై ప్రమాదాలు జరిగితే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రోజులు ఇవి. పక్కవారి ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటారు. పోలీసులు చేసిన ఓ పనిని చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు 'శభాష్ పోలీస్' అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
రోడ్లపై ప్రమాదాలు జరిగితే పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రోజులు ఇవి. పక్కవారి ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటారు. పోలీసులు చేసిన ఓ పనిని చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ‘శభాష్ పోలీస్’ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
యాద్రాద్రి జిల్లా చౌటుప్పల్ మునిసిపాలిటీ పరిధిలోని లక్కారంలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓవైపు నుంచి బీరు సీసాల లోడుతో, మరోవైపు ఉల్లిగడ్డ లోడ్‌తో వస్తున్న లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ డ్రైవర్ స్పాట్‌లో మృతి చెందడంతోపాటు నాలుగైదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో సకాలంలో స్పందించిన చౌటుప్పల పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో ధ్వంసమైన బీరు సీసాల గాజు ముక్కలు రోడ్డుపై ప్రమాదకరంగా చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో స్పాట్ చేరుకున్న చౌటుప్పల్ పోలీసులు కిలో మీటరు మేర ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు. వాహనాదారులకు ఇబ్బంది కాకండా రోడ్డు పక్కనే ఉన్న చెట్ల కొమ్మలను విరిచి రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయిన గాజు ముక్కలను ఓ పక్కకు ఊడ్చేశారు. దీంతో చౌటుప్పల్ పోలీసులకు డ్యూటీ పట్ల ఉన్న నిబద్ధతను చూసి వాహనదారులు, సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి..
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..