CM KCR: పోడు భూములకు పట్టాలు ఇస్తాం.. గిరిజన బంధు కూడా అందిస్తాం.. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గిరిజనులపై వరాల జల్లు కురిపించారు. పోడు భూముల విషంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వేదికగా గుడ్ న్యూస్ చెప్పారు. పోడు భూములకు పట్టాలే కాకుండా.. ‘రైతుబంధు’...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గిరిజనులపై వరాల జల్లు కురిపించారు. పోడు భూముల విషంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వేదికగా గుడ్ న్యూస్ చెప్పారు. పోడు భూములకు పట్టాలే కాకుండా.. ‘రైతుబంధు’ కూడా అమలు చేస్తామని వెల్లడించారు. అడవులు నరకం అని హామీ ఇస్తేనే పోడు భూముల పట్టాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్లు అడవులను నరికేయడం సరికాదని సూచించారు. అటవీ సంపదను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంత ఉందన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అడవుల పునరుజ్జీవన ప్రక్రియకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా, కనుమరుగు కావాలా అని ప్రశ్నించారు. నర్సాపూర్ అడవి ఎలా ఎడారైందో మనమంతా చూశామన్నారు. భూమిలేని గిరిజన బిడ్డలకు దళితబంధు తరహాలోనే గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామన్నారు.
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచిస్తోంది. పోడు భూములు సాగు చేసుకునే రైతులకు వాటికి పట్టాలిస్తాం. పట్టాలు ఇచ్చాక కూడా అడవులను ధ్వంసం చేస్తే ఇచ్చిన పట్టాలను వెనక్కి తీసుకుంటాం. పోడు భూముల్ని రక్షించటానికి వెళ్లే ఫారెస్ట్ అధికారులపై దాడులు చేయటం మానుకోవాలి. ప్రాణాలే తీసేస్తున్న ఘటనలు కలవరపెడుతున్నాయని, ఇలాంటి పనులకు దూరంగా ఉండాలి. పోడు భూముల పంపిణీ అంశాన్ని రాజకీయం చేయొద్దు. ఈ పంపిణీ ఎన్నికల కోసమో, రాజకీయాల కోసమో కాదు. కేవలం గిరిజనుల సంక్షేమం కోసమే.
– కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి




గుత్తికోయల గూండాగిరి మంచిది కాదన్న సీఎం.. అడవిని నరికేసి భూములు ఇవ్వండని అడగడం కరెక్ట్ కాదన్నారు. ఇకనుంచి అటవీ ప్రాంతంలోని ఒక్క చెట్టును కూడా నరకడానికి వీలు లేదని స్పష్టం చేశారు. అటవీ సరిహద్దులు పెట్టి సాయుధ దళాలతో పహారా ఏర్పాటు చేస్తామని తెలిపారు. గిరిజనుల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని సూచించారు. వాల్మీకి బోయలు, బేదర్, కిరాతక, నిషాధి, పెద్దబోయలు, తలయారి, చుండువాళ్లు, ఖయీతి లంబాడ, భాట్ మధురాలు, చమర్ మధురాలను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం



