CM KCR: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. త్వరలో రిటైర్మెంట్ వయసు పెంపు ఆలోచనల్లో తెలంగాణ సర్కార్

సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26 తేదీన జరిగే బోర్డు మీటింగ్ లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని

CM KCR: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. త్వరలో రిటైర్మెంట్ వయసు పెంపు ఆలోచనల్లో తెలంగాణ సర్కార్
Retirement Age Of Singareni
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 20, 2021 | 8:32 PM

కల నెరవేరబోతోంది. సింగరేణి కార్మికులకు సర్కార్‌ తీపికబురునందించింది. ఎంప్లాయీస్‌ రిటైర్‌మెంట్‌ ఏజ్‌పై కీ డెసిషన్‌ తీసున్నారు సీఎం కేసీఆర్‌. సీఎం నిర్ణయంతో కార్మికుల డిమాండ్‌ నెరవేరినట్టయ్యింది. సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల రిటైర్మెంట్ వయసును 61 ఏండ్లకు పెంచాలని త్వరలో ప్రకటించనున్నారు. ఈ మేరకు ఈనెల 26 తేదీన జరిగే బోర్డు మీటింగ్‌లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి MD శ్రీధర్‌ను CM KCR ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు CM పదవీ విరమణ వయస్సుపెంపు నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43, 899 మంది సింగరేణి కార్మికులు అధికారులకు లబ్ధి చేకూరనున్నది. రామగుండం నియోజక వర్గ కేంద్రం లో సింగరేణి మెడికల్ కాలేజీ ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి. సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కారాలు అంశం పై ఆ ప్రాంత పరిధిలోని ప్రజా ప్రతినిధులతో ప్రగతి భవన్ లో మంగళవారం CM KCR సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు.

మరోవైపు.. రామగుండంలో సింగరేణి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఇందుకు సంబంధించిన ఆదేశాలు త్వరలోనే వెలువడనున్నాయి. సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కారాలపై ఆ ప్రాంత పరిధిలోని ప్రజాప్రతినిధులతో ప్రగతిభవన్‌లో సమీక్షించారు సీఎం కేసీఆర్. పలు అంశాలపై చర్చించారు..

ఇవి కూడా చదవండి: Jeff Bezos success: ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్​ అంతరిక్షయాత్ర విజయవంతం.. సురక్షితంగా భూమికి చేరిన క్యాప్సుల్

CM Jagan: మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ.. క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి